Viral Video: అంత పెద్ద చిరుతపులి.. ఉడుతకు లోకువే.. చెట్టు మీద ఎలా ఆటాడుకుందో చూడండి..
ABN, Publish Date - Sep 24 , 2024 | 10:11 AM
చిరుత పులి కంటికి చిక్కిన జీవులు వాటికి ఆహారం కాకుండా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చిరుతలను మించి వేగంగా పరిగెత్తే జీవులు లేవు. ఎంత పెద్ద జంతువునైనా వెంటాడి వేటాడి చంపే చిరుతకు తాజాగా ఓ ఉడుత చుక్కలు చూపించింది.
చిరుత పులి (Leopard) కంటికి చిక్కిన జీవులు వాటికి ఆహారం కాకుండా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చిరుతలను మించి వేగంగా పరిగెత్తే జీవులు లేవు. ఎంత పెద్ద జంతువునైనా వెంటాడి వేటాడి చంపే చిరుతకు తాజాగా ఓ ఉడుత (Squirrel) చుక్కలు చూపించింది. ఎంత భారీ వృక్షాలనైనా పెకలించే సుడిగాలి చిన్న గడ్డి పోచను ఏం చేయలేదనే సామెత చందంగా ప్రస్తుతం ఓ చిరుత.. ఉడుతను ఏమీ చేయలేకపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ఆఫ్రికాలోని జంగిల్ సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఉడుతను చిరుత వెంటాడుతోంది. ఉడుత వెనుక పరుగులు తీస్తోంది. ఉడుత చెట్టు మీద నుంచి కిందకు, నేల పై నుంచి చెట్టు మీదకు, ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతోంది. దానిని వెంబడిస్తూ చిరుత కూడా అలాగే పరుగులు పెడుతోంది. దానిని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అయితే ఆ ఉడుత వెంట్రుకను కూడా ఆ చిరుత టచ్ చేయలేకపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2,400 మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ```తెలివితేటలుంటే క్లిష్టపరిస్థితుల నుంచి కూడా బయటపడవచ్చు``, ``ఎంత పెద్ద జంతువైనా ఈగలు, దోమలు, ఉడుతలను ఏమీ చేయలేవు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 24 , 2024 | 10:11 AM