ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఢిల్లీలో స్కార్పియో దొంగతనం.. రాజస్థాన్ తీసుకెళ్లిన దొంగలు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 09:01 PM

తాజాగా ఢిల్లీలో స్కార్పియో దొంగతనం చేసిన దొంగలు విచిత్రంగా ప్రవర్తించారు. ఢిల్లీ నుంచి ఆ వాహనాన్ని చోరీ చేసి రాజస్థాన్ తీసుకెళ్లి ఓ హోటల్ పక్కన వదిలేశారు. అయితే ఆ వాహనానికి వెనుక అద్దంపై ఉన్న రాతలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి.

Stolen Scorpio from Delhi was found abandoned on the Jaipur

సాధారణంగా దొంగలు ఎవరైనా ఏదైనా వాహనాన్ని దొంగతనం చేస్తే దానిని ఏ భాగానికి ఆ భాగం విడదీసి అమ్మేసుకుంటారు. లేకపోతే ఆ వాహనం నెంబర్ ప్లేట్, రంగు మార్చుకుని వాడుకుంటారు. అయితే తాజాగా ఢిల్లీ (Delhi)లో స్కార్పియో (Scorpio) దొంగతనం చేసిన దొంగలు మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. ఢిల్లీ నుంచి ఆ వాహనాన్ని చోరీ చేసి రాజస్థాన్ (Rajasthan) తీసుకెళ్లి ఓ హోటల్ పక్కన వదిలేశారు. అయితే ఆ వాహనం వెనుక అద్దంపై అంటించిన పేపర్‌పై రాసిన రాతలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది (Crime News).


ఢిల్లీలోని పాలంలో చోరీకి గురైన స్కార్పియో వాహనం రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో లభ్యమైంది. ఈ వాహనం రెండు రోజులుగా బికనీర్‌లో పాడుబడి ​​ఉంది. దొంగలు ఆ కారును నపసర్ ప్రాంతంలోని ఓ హోటల్ బయట పార్క్ చేశారు. చోరీకి పాల్పడిన దొంగలు క్షమాపణ లేఖ రాసి ఆ కారు వెనుక అద్దంపై అంటించారు. ఆ కారును ఢిల్లీలోని పాలం నుంచి చోరీ చేసినట్టు రాసి ఉంది. అలాగే వాహనాన్ని దొంగిలించినందుకు ``సారీ`` (Sorry) కూడా చెప్పారు. స్థానికులు ఆ క్షమాపణ పత్రాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ హోటల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Viral Video: కారులో అత్తారింటికి వధూవరులు.. కారులో వరుడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..


Viral Video: పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడా? రోడ్లపై ఆ వరుడు ఎందుకలా తిరుగుతున్నాడంటే..


Viral Video: తెలివి చూస్తే ఔరా అనాల్సిందే కానీ, బట్టలు కుట్టడం కోసం అంత ఖర్చు అవసరమా..?


Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 13 , 2024 | 09:01 PM