ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:55 PM

హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాల నుంచి తగాదాలు, ఫోన్లు పోగొట్టుకోవడం వంటి కేసుల వరకు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తేనే ఉపయోగం ఉంటుంది. పోలీసులు స్పందిస్తేనే న్యాయం జరుగుతుంది.

UP police demanded jalebi before writing the complaint

ఎవరికి ఏ నష్టం జరిగినా, ప్రమాదం వాటిల్లినా వెంటనే పోలీసులను (Police) ఆశ్రయిస్తారు. హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాల నుంచి తగాదాలు, ఫోన్లు పోగొట్టుకోవడం వంటి కేసుల వరకు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తేనే ఉపయోగం ఉంటుంది. పోలీసులు స్పందిస్తేనే న్యాయం జరుగుతుంది. అయితే పోలీసులు సత్వరమే స్పందించకపోయినా, అనుకోని డిమాండ్లు చేసినా మరే దారీ ఉండదు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఓ వ్యక్తికి తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది (Viral News).


యూపీ రాజధాని లక్నోకు 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌర్ గ్రామానికి చెందిన చంచల్ కుమార్ అనే వ్యక్తి మందులు కొనుగోలు చేసేందుకు మెడికల్ స్టోర్‌కు వెళ్లాడు. అయితే మార్గమధ్యంలో అతడి మొబైల్ (Mobile) ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే కేజీ జిలేబీ (Jalebi) తీసుకురావాలని, అలా అయితేనే కేసు నమోదు చేస్తామని చెప్పారు. జలేబీ లేకుండా పోలీసులు కేసు రిజస్టర్ చేయరని భావించిన చంచల్ అలాగే చేశాడు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్‌ను మాత్రం పట్టుకోలేకపోయారు.


దీంతో అతడు ఆ విషయం గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగులోకి రావడంతో కొందరు అధికారులు సస్పెండ్ అయ్యారు. కన్నౌజ్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ లంచం అని డైరెక్ట్‌గా అడగకుండా ``ఆలూ`` అని కోడ్ వర్డ్ ఉపయోగిస్తుంటారు. అలా లక్షల్లో వసూలు చేయడంతో విషయం పై అధికారులకు చేరి అతడిని విధుల నుంచి తొలగించారు. తాజాగా జిలేబీ డిమాండ్ చేసిన పోలీసులపై విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న కుక్క ఎమోజీని కనిపెట్టండి..!


Viral Video: పెళ్లి పీటలెక్కబోయే ముందు కూడా స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్.. అసలు కారణమేంటంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2024 | 04:56 PM

Advertising
Advertising
<