Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:00 PM
బస్సు, విమానాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చవకగా కూడా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చిన్న సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమస్యకు ఓ వ్యక్తి సులభమైన పరిష్కారాన్ని కనుగొని అందరికీ ఉపశమనం కలిగించాడు.
ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే రైలు (Train) ప్రయాణాన్ని చాలా సులభంగా, సౌకర్యవంతమైనదిగా పరిగణిస్తారు. బస్సు, విమానాలతో పోల్చుకుంటే ట్రైన్ జర్నీ (Train Journey) చవకగా కూడా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చిన్న సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమస్యకు ఓ వ్యక్తి సులభమైన పరిష్కారాన్ని కనుగొని అందరికీ ఉపశమనం కలిగించాడు. దాంతో ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
jully.singh అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌కి (AC Coach) సంబంధించినది. ఏసీ కోచ్‌లోకి ప్రవేశించేందుకు అమర్చిన గేటు తీసి, వేస్తున్నప్పుడు చాలా పెద్ద శబ్దం వస్తోంది. దీంతో ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిద్రపోవడానికి కుదరలేదు. అప్పుడు ఓ వ్యక్తి తన తెలివిని ఉపయోగించి ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. రైల్వే వారు ఇచ్చే ఓ తలగడను ఆ తలుపు పైన కట్టాడు. దీంతో తలుపు పూర్తిగా మూసుకోవడం లేదు. దాంతో ఆ శబ్దం పూర్తిగా ఆగిపోయింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ దేశీ జుగాడ్ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 37 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సమయస్ఫూర్తి అద్భుతంగా ఉంది``, ``ఆ సమస్యకు అంత కంటే మంచి పరిష్కారం ఉండదు``, ``కూలింగ్ అంతా బయటకు పోతుందేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 01 , 2024 | 06:00 PM