Viral News: వీధుల్లో కొత్త వ్యాపారం.. కౌగిలింతకు రూ.11.. ముద్దుకు రూ.110
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:01 PM
ఈరోజుల్లో చాలామంది అబ్బాయిలు సింగిల్స్‌గానే ఉండిపోతున్నారు. కొందరు అమ్మాయిలతో మాట్లాడేందుకు సాహసించలేకపోతుంటే.. మరికొందరు ప్రేమించడం కోసం యువతులు దొరక్క ఒంటరిగానే..
ఈరోజుల్లో చాలామంది అబ్బాయిలు సింగిల్స్‌గానే ఉండిపోతున్నారు. కొందరు అమ్మాయిలతో మాట్లాడేందుకు సాహసించలేకపోతుంటే.. మరికొందరు ప్రేమించడం కోసం యువతులు దొరక్క ఒంటరిగానే సమయం గడిపేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ పొందే బంపరాఫర్ వచ్చేసింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. కౌగలింత దగ్గర నుంచి సినిమాకు వెళ్లేదాకా.. ఒక్కోదానికి ఒక్క ఫీజుతో ‘స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్’ (Street Girlfriend) అనే వ్యాపారం వీధుల్లో మొదలైంది. కాకపోతే.. ఇది భారత్‌లో కాదు, చైనాలో మాత్రమే!
ప్రధానంగా సింగిల్స్ కోసమే..
ఈమధ్య కాలంలో ఒంటరిగా ఉండే అబ్బాయిల సంఖ్య చైనాలో గణనీయంగా పెరిగిపోయింది. ఈ తరుణంలోనే అమ్మాయిలు వారి కోసం ‘స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్’ అనే కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టారు. వీధుల్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి.. హగ్, ముద్దు అంటూ ఒక్కో దానికి ఒక్కో అమౌంట్‌ని ఛార్జ్ చేస్తున్నారు. నిజానికి.. ఈ ట్రెండ్ గతేడాదిలోనే ప్రారంభమైంది. కానీ.. అప్పట్లో దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఈమధ్య కాలంలో కస్టమర్లు గణనీయంగా పెరిగిపోయారు. వీధుల్లో చాలా ప్రాంతాల్లో యువతుల స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండే అబ్బాయిలే కాదు.. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న యువకులు.. ఒంటరితనం నుంచి బయటపడేందుకు గాను ఈ ట్రెండ్‌పై ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఛార్జ్ ఎంతంటే..
నివేదిక ప్రకారం.. ఒక్కో కౌగిలింతకు అక్కడి అమ్మాయిలు 1 యువాన్ (రూ.11) ఛార్జ్ చేస్తారట. అదే ముద్దుకైతే 10 యువాన్స్ (రూ.110) తీసుకుంటారు. ఒకవేళ తమతో కలిసి సినిమాకు రావాలంటే మాత్రం.. వారికి అబ్బాయిలు 15 యువాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదండోయ్.. ఇంటి పనిలో సమాయం చేసేందుకు 20 యువాన్స్, కలిసి తాగేందుకు 40 యువాన్స్ ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా అక్కడి యువతులు రోజుకు కనీసం 100 యువాన్స్ అయినా సంపాదిస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ వ్యాపారంలో తాము లైంగిక సంబంధాలు పెట్టుకోమని ఓ యువతి స్పష్టం చేసింది. ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, సినిమాలకు వెళ్లడం మినహాయిస్తే.. అంతకుమించి హద్దుమీరమని ఆమె క్లారిటీ ఇచ్చింది.
భిన్నాభిప్రాయాలు..
అయితే.. ఈ కొత్త వ్యాపారంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాక్టివిటీ కస్టమర్‌లతో పాటు అమ్మాయిలకూ స్వేచ్ఛనిస్తుందని.. దీని ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అంటున్నారు. అంతేకాదు.. దీని ద్వారా సోషల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. మరికొందరు మాత్రం.. మహిళల కంపెనీకి ధర కేటాయించడం అవమానకరమైన విషయమని, ఇది వారి గౌరవాన్ని దిగజారుస్తుందని అంటున్నారు. ఇది చట్టవిరుద్ధం కావొచ్చని.. అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, తమ భద్రతను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 31 , 2024 | 06:01 PM