Viral: వామ్మో.. టీచర్ మీద ఇంత పగా.. పరీక్షలో ఓ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్‌తో నివ్వెరపోవాల్సిందే..
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:39 AM
పరీక్షలు అనగానే ఎంతో కష్టపడి చదివి జవాబులు రాసి మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు కొందరు ఉంటారు. మరికొందరు ఎవో కొన్ని మాత్రమే చదివి తమకు తోచింది రాసేస్తుంటారు. మరికొందరు మాత్రం అసలేమీ చదవకుండా, అడిగిన ప్రశ్నతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా జవాబులు రాస్తుంటారు.
(Students)కొందరు ఉంటారు. మరికొందరు ఎవో కొన్ని మాత్రమే చదివి తమకు తోచింది రాసేస్తుంటారు. మరికొందరు మాత్రం అసలేమీ చదవకుండా, అడిగిన ప్రశ్నతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా జవాబులు రాస్తుంటారు. తాము చదవడం మానేసి, టీచర్లపై (Teacher) కోపం పెంచుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆన్సర్ షీట్ (Viral Answer Sheet) చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. టీచర్ మీద ఓ స్టూడెంట్ ఎంత కోపంతో ఉన్నాడో ఆ ఆన్సర్ షీట్ చూస్తే అర్థం అవుతోంది (Viral News).
ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో కొన్ని పదాలు ఇచ్చి వాటిని వివరించమని అడిగారు. టీచర్, పోలీస్, పైలెట్, డాక్టర్ మొదలైన పదాలను వివరించారు. దానికి ఆ విద్యార్థి జవాబు రాస్తూ.. ``టీచర్: మా టీచర్ క్రిమినల్, పోలీస్: మా టీచర్‌ను అరెస్ట్ చేయండి. పైలెట్: మా టీచర్ తల మీద విమానం ల్యాండ్ చేయండి. డాక్టర్: మా టీచర్‌కు పాజిటివ్ ఇంజక్షన్ ఇవ్వండి`` అంటూ మొత్తం తన టీచర్ మీద కోపాన్ని బయటపెట్టాడు. టీచర్‌పై తనకున్న కసిని ఆ సమాధానంలో బేషుగ్గా పొందుపొరిచాడు. ఈ జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌కు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ జవాబు పత్రాన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. ``ఇప్పుడే ఇలా ఉన్నావంటే.. పెద్దయ్యాక నీ గురించి ఊహించడం కష్టం``, ``టీచర్‌ను చంపే వరకు నిద్రపోయేలా లేడు``, ``ఆ టీచర్ స్కూలు మారిపోవడం మంచిది``, ``ఈ అన్షర్ షీట్ చదివిన ఆ టీచర్ పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 20 , 2024 | 11:39 AM