Funny Answer Sheet: హిస్టరీ పరీక్షలో ఆ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్.. టీచర్ ఏం చేశారంటే..
ABN, Publish Date - Oct 20 , 2024 | 08:34 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో ఫన్నీ ఆన్సర్ షీట్‌లు వైరల్‌గా మారాయి. టీచర్లకే కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ కుర్రాడు రాసిన సమాధానం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. ఆ సమాధాన పత్రం దిద్దన టీచర్ ఆ కుర్రాడికి తగిన బుద్ధి చెప్పారు.
సరిగ్గా చదవకపోవడం వల్ల, తెలియని ప్రశ్న రావడం వల్ల ఒక్కోసారి విద్యార్థులు (Student) పరీక్షల్లో (Exam) తమకు తోచిన సమాధానాలు రాసేస్తుంటారు. అవి ఆ సమాధాన పత్రాలు దిద్దేవారికి కోలుకోలేని షాకిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఆన్సర్ షీట్‌లు వైరల్‌గా (Viral Answer Sheets) మారాయి. టీచర్లకే (Teacher) కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ కుర్రాడు రాసిన సమాధానం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. ఆ సమాధాన పత్రం దిద్దన టీచర్ ఆ కుర్రాడికి తగిన బుద్ధి చెప్పారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Funny Answer Sheet).
వైరల్ అవుతున్న ఈ జవాబు పత్రం సంగం యూనివర్సిటీ విద్యా సంస్థకు చెందినది. బీఏ సెకెండ్ ఇయర్ హిస్టరీ ఎగ్జామ్‌లో ఆశిష్ కుమార్ అనే విద్యార్థి రాసిన సమాధానం టీచర్లను ఉలిక్కిపడేలా చేసింది. హిస్టరీ ఎగ్జామ్‌లో అలగ్జాండర్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. ``జీలం యుద్ధాన్ని 300 పదాలలో వివరించండి`` అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆశిష్ జవాబు రాస్తూ.. ``భారతదేశంలో జీలం యుద్ధం చాలా ముఖ్యమైనది, ఇందులో అలెగ్జాండర్ గుర్రాలను పోరస్‌ను వెంబడించాడు`` అని రాశాడు. ఆ క్రమంలో అలెగ్జండర్ గుర్రం పరుగు గురించి వివరించాడు. అలగ్జాండర్ గుర్రం మీద ఎలా వస్తాడో రాస్తూ ``తపడక్.. తపడక్..`` అంటూ గుర్రం డెక్కల చప్పుడుతో ఆ పేపర్‌ను నింపేశాడు.
అనంతరం అలెగ్జాండర్, పోరస్.. ``. ధయ్, ధయ్, ధయ్`` అని బాణాలు వేసుకున్నారని రాశాడు. ఇలా తనకు తోచింది రాసి పడేశాడు. ఆ జవాబు పత్రాన్ని చదివిన టీచర్ ఆ విద్యార్థికి 80కి గానూ కేవలం 7 మార్కులు మాత్రమే వేశారు. అంతేకాదు కింద తన కామెంట్‌ను రాస్తూ ``చాలా వెనుకబడిన విద్యార్థి`` అని రిమార్క్ రాశారు. ఈ జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 1.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ పోస్ట్‌ను వీక్షించారు. 1.4 వేల మందికి పైగా ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆ కుర్రాడు భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా ఎదుతాడ``ని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీ బ్రెయిన్ స్పీడ్ ఎంత?.. ఈ పార్టీలో దొంగను 5 సెకెన్లలో పట్టుకోండి..
Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..
Optical Illusion: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువా?.. అయితే ఈ ఫొటోలో వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Oct 20 , 2024 | 08:34 AM