Viral Video: ఏడో తరగతి కుర్రాడు రాసిన లీవ్ లెటర్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ప్రిన్సిపాల్‌కు ఏం చేయాలో అర్థం కాక..
ABN, Publish Date - Aug 10 , 2024 | 03:57 PM
పిల్లలు సాధారణంగా స్కూల్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. ఉదయం లేచి స్కూల్‌కు రెడీ అవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఏదో ఒక కారణంగా చెప్పి ఇంటి దగ్గర ఉండిపోవడానికి ప్రయత్నిస్తారు. వారిని స్కూల్‌కు రెడీ చేసి పంపించడం తల్లిదండ్రులకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది.
పిల్లలు సాధారణంగా స్కూల్‌కు (School) వెళ్లడానికి ఇష్టపడరు. ఉదయం లేచి స్కూల్‌కు రెడీ అవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఏదో ఒక కారణంగా చెప్పి ఇంటి దగ్గర ఉండిపోవడానికి ప్రయత్నిస్తారు. వారిని స్కూల్‌కు రెడీ చేసి పంపించడం తల్లిదండ్రులకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. తాజాగా ఓ కుర్రాడు తన స్కూల్ ప్రిన్సిపాల్‌కు రాసిన లీవ్ లెటర్ (Leave letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు లెటర్ రాసిన పద్ధతి చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే (Viral Video).
rolex_0064 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి సెలవు కోసం ప్రిన్సిపాల్‌కి లెటర్ రాశాడు. పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఉద్దేశించి ఆ లెటర్ రాశాడు. కింద ``డియర్ మేడమ్`` అని రాసి.. ``నేను రాను`` అని రాశాడు. తర్వాత రెండో లైన్లో కూడా ``నేను రాను, నేను రాను`` అని రెండు సార్లు రాశాడు. థాంక్యూ అని రాసిన తర్వాత కూడా ``నేను రాను`` అని పునరుద్ఘాటించాడు. చివర్లో సంతకం పెట్టి, తేదీ వేశాడు.
ఆ లెటర్‌లో ``నేను రాను`` అనే వాఖ్యాన్ని తప్ప మరింకేదీ ఆ విద్యార్థి రాయలేదు. ఆ లెటర్‌ను ప్రిన్సిపాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 28 కోట్ల మంది ఆ లెటర్‌ను వీక్షించారు. 5.8 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆ కుర్రాడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్‌కు వెళ్లడు``, ``ప్రిన్సిపాల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు`` అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Viral Video: ఈ వీడియో చూస్తే దడుచుకోవాల్సిందే.. తనను తానే తినేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 10 , 2024 | 03:57 PM