Viral Video: స్టూడెంట్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:03 PM
ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధం ఎంతో విలువైంది. పిల్లల ఎదుగుదలలో గురువుదే కీలకపాత్ర. పిల్లల మనసు తెలుసుకుని చక్కగా అర్థమయ్యేలా చదువు చెప్పే ఉపాధ్యాయులను ఏ పిల్లలైనా ఇష్టపడతారు. వారిని ఎంతగానో ప్రేమిస్తారు.
ఉపాధ్యాయులు (Teacher), విద్యార్థుల (Students) మధ్య బంధం ఎంతో విలువైంది. పిల్లల ఎదుగుదలలో గురువుదే కీలకపాత్ర. పిల్లల మనసు తెలుసుకుని చక్కగా అర్థమయ్యేలా చదువు చెప్పే ఉపాధ్యాయులను ఏ పిల్లలైనా ఇష్టపడతారు. వారిని ఎంతగానో ప్రేమిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో గురువు, విద్యార్థుల మధ్య ఉండాల్సిన బంధం గురించి వెల్లడించింది. ఆ వీడియో చూసిన చాలా మంది తమ స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@Gulzar_sahab అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీచర్ బర్త్‌డేకు స్కూలు విద్యార్థినులు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ టీచర్ క్లాస్‌లోకి వస్తూ కెమేరా చూసి సిగ్గుపడి బయటకు వెళ్లిపోయారు. విద్యార్థులు బతిమాలిన తర్వాత లోపలికి వచ్చారు. ఓ స్టూడెంట్ ఆమెకు గిఫ్ట్ ఇచ్చారు. అది ఓపెన్ చేసి చూసి ఆ టీచర్ భావోద్వేగానికి గురయ్యారు. టీచర్ ఫొటోలోన్నింటినీ కలిపి ఫ్రేమ్ చేసి స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 6.8 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 11 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు తమ చిన్న నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ``కల్మషం లేని ప్రేమ``, ``టీచర్, స్టూడెంట్స్ మధ్య ఉండాల్సిన నిజమైన బంధం``, ``నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 19 , 2024 | 12:03 PM