Viral Video: టీషర్ట్ మడతపెట్టిన టెస్లా ఆప్టిమస్ రోబో..ఎలాన్ మస్క్ పోస్ట్ వైరల్
ABN, Publish Date - Jan 17 , 2024 | 05:50 PM
మీరెప్పుడైనా టీషర్టులు మడతపెట్టిన రోబోలను చుశారా? లేదా అయితే ఇక్కడ చుసేయండి. తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) తన టెస్లా ఆప్టిమస్(Optimus) రోబోట్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అందులో రోబో టీషర్ట్ మడపపెడుతూ కనిపించింది. వీడియోలో రోబోట్ టేబుల్ ముందు నిలబడి ఉంది. అందులో ఒక వైపు ఉన్న బుట్టలో నుంచి హ్యూమనాయిడ్ నలుపు రంగు టీ షర్టును తీసి టేబుల్‌పై ఉంచింది. ఆ తర్వాత రోబోట్ టీ షర్టును నెమ్మదిగా మడవటం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇంకా ఆ రోబోట్ టీ షర్టును సరిగ్గా మడతపెట్టడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Monkey iPhone: లంచం ఇస్తేనే ఐఫోన్ ఇస్తా.. కోతి చేసిన కొంటె పనికి దిమ్మతిరగాల్సిందే!
ఇక ఈ వీడియోను జనవరి 16న సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా..ఈ వార్త రాసే సమయానికి దీనికి 69.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు రెండు లక్షల ఆరు వేల మందికిపైగా దీనిని లైక్ కూడా చేశారు. 36 వేల మందికిపైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఎలాన్ మస్క్(Elon musk) షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి. అంతేకాదు గతంలో ఈ హ్యూమనాయిడ్ రోబో నమస్తే చెబుతూ కనిపించింది. ఈ రోబోలో టెస్లా AI సాంకేతికత ఉపయోగించబడింది. ఇది రోజంతా సులభంగా పని చేస్తుంది. WiFi, LTE లకు సపోర్ట్ చేస్తుంది.
Updated Date - Jan 17 , 2024 | 05:50 PM