ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వార్నీ.. ఇంత క్రూరత్వమా.. మ్యాచ్‌లో ఓడిన విద్యార్థులపై టీచర్ ఘాతుకం.. కాలితో తంతూ, బూతులు తిడుతూ..

ABN, Publish Date - Aug 14 , 2024 | 09:27 AM

ఆటల్లో గెలుపోటములు అనేవి సహజం. ఆ గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం అలవాటు చేయడం కూడా క్రీడల వెనుక ఉన్న ఓ ముఖ్య ఉద్దేశం. గెలిచినపుడు అందరూ సంబరాలు చేసుకుంటారు. ఓడినపుడు ఆటగాళ్లు, ముఖ్యంగా చిన్న పిల్లలను టీచర్ ముందుకు వచ్చి ఊరడించాలి.

Tamil Nadu teacher beats school’s football players

ఆటల్లో (Games) గెలుపోటములు అనేవి సహజం. ఆ గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం అలవాటు చేయడం కూడా క్రీడల వెనుక ఉన్న ఓ ముఖ్య ఉద్దేశం. గెలిచినపుడు అందరూ సంబరాలు చేసుకుంటారు. ఓడినపుడు ఆటగాళ్లు, ముఖ్యంగా చిన్న పిల్లలు కాస్త డీలా పడినపుడు టీచర్ (Teacher) ముందుకు వచ్చి వారిని ఊరడించి తర్వాతి మ్యాచ్ కోసం సన్నద్ధం చేయాలి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం పిచ్చిగా ప్రవర్తిస్తూ టీచర్ అనే పదానికే అనర్హులు అనిపించుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


తమిళనాడు (TamilNadu)లో స్కూల్ గేమ్‌లో ఓడిపోయినందుకు ఓ టీచర్ తన విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు చాలా మందికి ఆగ్రహం కలిగిస్తోంది. సంగాగిరి జిల్లాలోని ఓ స్కూల్ తరఫున ఆడిన ఓ ఫుట్‌బాల్ (Football) మ్యాచ్‌లో ఓడిపోయిన విద్యార్థులను వారి టీచర్ చితక్కొట్టాడు. వారిని రోడ్డు మీద కూర్చోబెట్టి అందరి ముందు బూతులు తిట్టాడు. కొట్టడం, కాళ్లతో తన్నడం వంటివి చేశాడు. పాపం.. ఆ టీచర్ ఆగ్రహం చూసి కుర్రాళ్లు భయంతో ఉండిపోయారు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ల్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో అంత దారుణంగా వ్యవహరిస్తున్న టీచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వైరల్ వీడియోపై సంగాగిరి జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!


Picture Puzzle: ఈ పజిల్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు.. తేడాగా ఉన్న పులి మొహాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2024 | 09:27 AM

Advertising
Advertising
<