Viral Video: పెళ్లి పీటలెక్కబోయే ముందు కూడా స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్.. అసలు కారణమేంటంటే..
ABN, Publish Date - Aug 25 , 2024 | 12:40 PM
కొందరు ఉపాధ్యాయులు స్కూలుకు వెళ్లడానికి సాకులు వెతుక్కుంటుంటే, మరికొందరు మాత్రం వాన వచ్చినా, తుఫాను వచ్చినా సరే స్కూలుకు వెళ్లిపోవాలని చూస్తారు. అలాంటి టీచర్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు ఉపాధ్యాయులు (Teacher) స్కూలుకు వెళ్లడానికి సాకులు వెతుక్కుంటుంటే, మరికొందరు మాత్రం వాన వచ్చినా, తుఫాను వచ్చినా సరే స్కూలుకు వెళ్లిపోవాలని చూస్తారు. అలాంటి టీచర్ వీడియో (Groom) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి రోజున కూడా ఈ టీచర్ పెళ్లికూతురుతో (Bride) సహా నేరుగా పాఠశాలకు వచ్చి క్లాసులు కూడా తీసుకున్నాడు. therajasthanhouse అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి జరిగే రోజున కూడా అతడు సెలవు తీసుకోకుండా నేరుగా స్కూలుకు వెళ్లిపోయాడు. పెళ్లి దుస్తుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పాడు. అతడికి కాబోయే భార్య కూడా భర్తతో పాటు స్కూలుకు వెళ్లింది. ఆ ఇద్దరూ కూడా అదే పాఠశాలలో పని చేస్తున్నారట. అందుకే పెళ్లి రోజున కూడా స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాతనే పెళ్లి పీటలు ఎక్కారట. ఇద్దరూ స్కూలుకు వెళ్లి ఇతర ఉపాధ్యాయులతో కలిసి ఫొటోలు దిగారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 19 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అతడు లెక్కల టీచర్ అయ్యుంటాడు``, ``ఎవరైనా సెలవు పెడతారు కానీ, గణిత ఉపాధ్యాయుడు కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. కొండచిలువతో ఆటలాడిన యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
Picture Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 10 సెకెన్లలో ఈ ఫొటోలోని ``Friends``ని కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 25 , 2024 | 12:40 PM