ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బాబూ.. క్లాస్ రూమ్‌లో ఇదేం పని.. టీచర్ పాఠం చెబుతుంటే ఓ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Oct 26 , 2024 | 09:17 AM

కాలేజీకి వెళ్లే వయసులో చేసే అల్లరి, తరగతి గదిలో స్నేహితులతో కలిసి చేసిన చిలిపి పనులను ఎవరూ అంత త్వరగా మర్చిపోరు. ముఖ్యంగా క్లాస్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చునే విద్యార్థులు ఒక్కోసారి పరిధి దాటి అల్లరి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

student making bhel in the classroom

ప్రతిఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు (College days) మరపురానివిగా మిగిలిపోతాయి. ఆ వయసులో చేసే అల్లరి, తరగతి గదిలో (Classroom) స్నేహితులతో కలిసి చేసిన చిలిపి పనులను ఎవరూ అంత త్వరగా మర్చిపోరు. ముఖ్యంగా క్లాస్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చునే విద్యార్థులు (Backbenchers) ఒక్కోసారి పరిధి దాటి అల్లరి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు తమ కాలేజీ రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. @rose_k01 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తరగతి గదిలో టీచర్ సీరియస్‌గా క్లాస్ చెబుతున్నారు. అయితే బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న విద్యార్థులు మాత్రం అదేం పట్టించుకోకుండా భేల్ పూరీ (Bhel Puri) తయారు చేస్తున్నారు. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి వాటిలో మసాలా వేశారు. ఆ తర్వాత ఓ బాక్స్‌లో మరమరాలు వేసి ఆ మిశ్రమాన్ని కలిపి భేల్ పూరీ తయారు చేశారు. అలా క్లాస్‌లో బ్యాక్ బెంచీలో కూర్చుని భేల్ పూరీ తయారు చేసుకుని తిన్నారు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``బ్యాక్ బెంబ్ ప్రో మ్యాక్స్`` అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 22 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 18 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``భవిష్యత్తులో రోడ్డు పక్కన ఇదే పని చేయాల్సి ఉంటుందేమో``, ``ఇలాంటి వారే భవిష్యత్తులో ఏమీ సాధించలేక విద్యా వ్యవస్థను తిడుతుంటారు``, ``కుర్రాడు క్లాస్‌రూమ్‌ నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఓర్నీ.. ఇంతకు తెగిస్తారా? ప్రజల కళ్ల ముందే కిడ్నాప్.. చివరకు బయట పడిన షాక్ ఏంటంటే..


Picture Puzzle: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనుక్కోండి...


Viral: ఆ స్కూల్‌లో పేరెంట్స్‌‌కి కూడా ఫీజు కట్టాల్సిందే.. నర్సరీకి ఎంత ఫీజు కట్టాలో తెలిస్తే.. పోస్ట్ వైరల్..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``Kite`` పదాన్ని 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 26 , 2024 | 09:17 AM