Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:34 AM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మందిని భయటపెట్టే జీవి పాము. క్షణాల్లో ప్రాణాలు తీయగల విషపూరిత సర్పాలు అంటే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపామును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.

Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!
King Cobra

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మందిని భయటపెట్టే జీవి పాము (Snake). క్షణాల్లో ప్రాణాలు తీయగల విషపూరిత సర్పాలు అంటే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపామును (King Cobra) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాములు సైజులో కూడా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కింగ్ కోబ్రా ఉగ్రరూపం చూస్తే ఎంతటి వారైనా ఉలిక్కిపడాల్సిందే. ఈ వీడియోలో నాగుపాము వేసిన భయంకర కేకలు కూడా రికార్డ్ అయ్యాయి (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఓ నాగుపాము ఓ చిన్న పామును వేటాడింది. దానిని తన నోటితో పట్టుకుని అత్యంత సీరియస్‌గా చూస్తోంది. పామును నోటితో పట్టుకుని కెమెరా వైపు చాలా సేపు చూస్తుండిపోయింది. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహంతో గట్టిగా బుసలు కొడుతూ, తన నోటిలోని పామును ఒక్క దెబ్బతో నేలకేసి కొట్టింది. ఆ నాగుపాము అత్యంత భారీ సైజులో ఉంది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు షాకవుతున్నారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి పైగా వీక్షించారు. 39 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నాగపాము భయంకరంగా కేకలు కూడా వేయగలదా``, ``పాము కేకలను నా జీవితంలో మొదటిసారి వింటున్నా``, ``ఇది అత్యంత భయంకరం``, ``వీడియో తీసిన వ్యక్తి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``నాగుపాములు చాలా భారీగా ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 10:34 AM

Advertising
Advertising
<