Picture Puzzle: మీ మెదడుకు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!
ABN, Publish Date - Aug 16 , 2024 | 08:23 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొందరు పిల్లలు ఓ ఇండోర్ స్టేడియంలో ఆటలు ఆడుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిపి బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. అయితే ఆ ఫొటోలో ఆరు ఆంగ్ల పదాలు దాక్కుని ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడున్నాయో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 15 సెకెన్ల వ్యవధిలో ఆ ఆంగ్ల పదాలను కనిపెట్టగలాగాలి. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. జాగ్రత్తగా గమనిస్తే.. Do, Cello, Fun, Boom, Home, May వంటి ఇంగ్లీష్ వర్డ్స్ కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇది ట్రైన్ లాంటిది, కానీ ట్రైన్ కాదు.. లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..!
Viral Video: వామ్మో.. ఇంత ధైర్యం ఏంటి స్వామి? పాము నోటిలో నోరు పెడితే.. తర్వాతేం జరిగిందో చూడండి..!
Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 16 , 2024 | 08:23 AM