Viral: కొంపముంచిన జీపీఎస్.. స్నేహితుడిని కలవడానికి కారులో వెళ్తున్న యువతి.. చివరకు మార్గమధ్యలో..
ABN, Publish Date - Feb 01 , 2024 | 09:24 PM
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో నష్టాలు కూడా జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా కూడా...
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో నష్టాలు కూడా జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ప్రయాణ సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇటీవల తహిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్ సాయంతో కర్నాటక వెళ్తుండగా.. మార్గమధ్యలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. తాజాగా, థాయ్‌లాండ్‌కు చెందిన ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అసలు ఏం జరిగిందంటే..
థాయ్‌లాండ్ (Thailand) పట్టాయా ప్రాంత పరిధికి చెందిన ఓ యువతి జనవరి 28న తన స్నేహితుడిని కలిసేందుకు కారులో సంగ్ మెన్ అనే ప్రాంతానికి బయలుదేరింది. అయితే ఆ ప్రాంతం ఆమెకు కొత్త కావడంతో జీపీఎస్‌ను (GPS) ఆశ్రయించింది. దాని సాయంతో ఆమె కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. జీపీఎస్ చూపిన విధంగా వెళ్తున్న ఆమె కారు.. మార్గ మధ్యలో ఓ పొడవాటి చెక్క వంతెన (Wooden bridge) పైకి వెళ్లింది. కారు టైరు చెక్కల మధ్య ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో చివరకు ఆమె స్థానికులను ఆశ్రయించింది.
Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
చివరకు సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని, కారును సురక్షితంగా బయటకు తీశారు. 120 మీటర్ల పొడవైన ఆ చెక్క వంతెన.. పాదచారుల కోసం ఏర్పాటు చేసిందని తెలిసంది. జీపీఎస్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘కొంపముంచిన జీపీఎస్’’.. అంటూ కొందరు, ‘‘ఇంకా నయం ఏకంగా నదిలోకి తీసుకెళ్లలేదు’’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Feb 01 , 2024 | 09:53 PM