Pigeon Bird Control : పావురాలను బాల్కనీలో చేరకుండా చేయాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!
ABN, Publish Date - Mar 05 , 2024 | 01:44 PM
పావురాలు సాధారణంగా బాల్కనీలో ఉన్నట్లయితే AC అవుట్‌డోర్ యూనిట్‌లో కూర్చుంటాయి. వాటిని కాస్త భయపెట్టాలంటే స్పైక్ వంటి బొమ్మలు, గ్రద్ధ ఆకారం బొమ్మలను పెట్టడం వల్ల పక్షులు ఆ ప్రదేశాలకు రావడానికి ఇష్టపడవు. ఇవన్నీ పక్షులు మన ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండేందుకు చేపట్టవలసిన ఉపాయాలు.. ప్రయత్నించి చూడండి.
పక్షులు ఇంట్లో వాలడం, తిండి గింజలు తిని వెళిపోవడం వరకూ ముచ్చటగానే ఉంటుంది కానీ.. అవి అలాగే బాల్కనీలలో ఆవాసాలను ఏర్పరుచుకుని ఉండిపోతే మాత్రం చాలా చికాకుగా ఉంటుంది. దీనితో శ్వాస ఇబ్బందులు, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో బాల్కనీని ఎప్పటికప్పుడు శుభ్రంగా, చక్కగా ఉండేలా చూస్తాం. అయితే మనం ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి బాల్కనీలపై పావురాల వాలడం. పావురాలు, ఆ స్థలాన్ని మురికిగా చేసి, రెట్టలతో నాశనం చేస్తాయి. అయితే, కొంతమంది పావురాలు, కాకులు వంటి పక్షులకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆహారాన్ని ఇచ్చి న చోటే, నీటి గిన్నెను నేలపై ఉంచినట్లయితే, ఆ ప్రదేశం అపరిశుభ్రంగా మారుతుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పావుల బెడద ఉండదో చూద్దాం.
బాల్కనీల నుండి పావురాలను ఎలా తరిమేయాలి ?
1. ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే, అది కుక్క, పిల్లి వంటి వాటిని బాల్కనీలో పావురాలు వాలే చోట ఉంచితే ఇవి పక్షులు రాకను ఇష్టపడవు. బాల్కనీకి దూరంగా తరిమేయడంలో సహకరిస్తాయి.
2. బాల్కనీలో మిరియాల పొడిని కూడా చల్లుకోవచ్చు. ఇది పక్షులు బాల్కనీలోకి ప్రవేశించకుండా, ఉండకుండా నిరోధిస్తుంది. మిరియాలు పావురాలకు చికాకు కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!
ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!
యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
3. బాల్కనీలో విండ్ చైమ్(wind chime)ను కూడా ఉంచవచ్చు. ఈ గంటల శబ్దానికి పక్షులు దూరంగా ఉంటాయి.
4. పక్షులు ప్రవేశించకుండా ఉండేందుకు బాల్కనీ ముందు నెట్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
5. మామూలుగా పావురాలు బాల్కనీని క్రమం తప్పకుండా వచ్చి వాలడానికి ప్రధాన కారణం అక్కడ వాటికి గూడు ఉండటం. కాబట్టి, గూడు ఎక్కడ ఉందో విశ్లేషించి, దానిని సురక్షితమైన ప్రదేశానికి మార్చండి.
6. పావురాలు సాధారణంగా బాల్కనీలో స్థిరపడే కొన్ని ప్రాంతాలలో, స్పైక్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. పావురాలను బాల్కనీ నుండి దూరంగా ఉంచడానికి సులభమైన మార్గాలలో ఒకటి ఈజీ షాపింగ్ బజార్ బర్డ్ నెట్‌ని ఇన్‌స్టాల్ చేయడం. ఈ పక్షి వల దాని ద్వారా పక్షులు ప్రవేశించడానికి స్థలం లేకుండా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
దగ్గు తగ్గకపోవడం, గొంతు పొడి బారడం లక్షణాలు కనిపిస్తే.. అది థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు...!
వేసవి ఆహారంలో చేర్చడానికి ఏడు మ్యాజికల్ డ్రై ఫ్రూట్స్.. !
యోఫిట్ బర్డ్ స్కేర్‌క్రో (Yophit Bird Scarecrow)
పావురాలు సాధారణంగా బాల్కనీలో ఉన్నట్లయితే AC అవుట్‌డోర్ యూనిట్‌లో కూర్చుంటాయి. వాటిని కాస్త భయపెట్టాలంటే స్పైక్ వంటి బొమ్మలు, యోఫిట్ బర్డ్ స్కేర్‌క్రో (Yophit Bird Scarecrow) గ్రద్ధ ఆకారం బొమ్మలను పెట్టడం వల్ల పక్షులు ఆ ప్రదేశాలకు రావడానికి ఇష్టపడవు. ఇవన్నీ పక్షులు మన ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండేందుకు చేపట్టవలసిన ఉపాయాలు.. ప్రయత్నించి చూడండి.
Updated Date - Mar 05 , 2024 | 01:47 PM