Viral: ఛీ.. ఛీ.. భార్య ముందు పరువు పోయింది.. షాప్ కీపర్‌ను ఆ వ్యక్తి ఎందుకు కొట్టాడో తెలిస్తే నవ్వాపుకోలేం..
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:35 PM
కొందరు వ్యక్తులు ఒక్కోసారి భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. చిన్న విషయాలను పట్టించుకుని పెద్దదిగా చేసుకుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
కొందరు వ్యక్తులు ఒక్కోసారి భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా చిన్న విషయాలకు కోపం (Angry) తెచ్చుకుంటారు. చిన్న విషయాలను పట్టించుకుని పెద్దదిగా చేసుకుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆ ఘటన గురించి తెలిస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. భోపాల్ (Bhopal)కు చెందిన ఆ వ్యక్తి తన భార్యతో కలిసి బట్టల దుకాణానికి వెళ్లాడు. అక్కడ షాప్ కీపర్ ``అంకుల్`` (Uncle) అని పిలవడం అతడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ కోపం ఎక్కడి వరకు దారి తీసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే (Crime News).
భోపాల్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి గత శనివారం తన భార్యతో కలిసి చీర కొనడానికి జట్‌ఖేడి అనే ప్రాంతంలోని దుకాణానికి వెళ్లాడు. రోహిత్ భార్య చాలా సేపు చీరలు చూసినా ఏదీ ఆమెకు నచ్చలేదు. దీంతో చీరలు చూపించే విశాల్ అనే వ్యక్తి అసహనానికి గురయ్యాడు. ``మీకు ఏ రేంజ్‌లో చీరలు కావాలి అంకుల్`` అని అడిగాడు. తనను అంకుల్ అని పిలిచినందుకు రోహిత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ``అంకుల్`` అనే పదానికి సంబంధించి రోహిత్, విశాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చాలా సేపు గొడవ పడిన తర్వాత రోహిత్ తన భార్యను తీసుకుని షాప్ నుంచి వెళ్లిపోయాడు.
కొద్ది సేపటి తర్వాత తన స్నేహితులతో కలిసి మళ్లీ ఆ షాప్‌నకు వెళ్లాడు. విశాల్‌ను షాప్ నుంచి బయటకు తీసుకు వెళ్లి అతణ్ని కర్రలు, బెల్టులతో కొట్టారు. కాలితో తన్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. దాడి తరువాత, విశాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోహిత్‌తో పాటు అతని సహచరులపై కేసు నమోదు చేశారు. నిందితులును త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
Viral Video: ఈమె ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్.. వర్షంలో నిల్చుని ఏం చేస్తోందో చూడండి.. నవ్వాపుకోలేరు..
Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 06 , 2024 | 02:59 PM