ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లి వేడుకలో పానీ పూరీ.. పానీ వేసేందుకు వాడిన టెక్నిక్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..

ABN, Publish Date - Sep 03 , 2024 | 01:10 PM

మన దేశంలో చాలా మంది ఇష్టంగా తినే స్నాక్ పానీపూరీ. రోడ్ల పక్కన పెట్టే స్టాల్స్ దగ్గర పానీపూరీల కోసం క్యూలు కడుతుంటారు. చిన్నా, పెద్దా లేకుండా అందరూ ఇష్టపడే పానీపూరీని ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో కూడా అందిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో కూడా పానీపూరీ ఇచ్చారు.

serving golgappas in wedding parties

మన దేశంలో చాలా మంది ఇష్టంగా తినే స్నాక్ పానీపూరీ (Panipuri). రోడ్ల పక్కన పెట్టే స్టాల్స్ దగ్గర పానీపూరీల కోసం క్యూలు కడుతుంటారు. చిన్నా, పెద్దా లేకుండా అందరూ ఇష్టపడే పానీపూరీని ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో కూడా అందిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి (Wedding) వేడుకలో కూడా పానీపూరీ (Golgappa) ఇచ్చారు. అయితే ఆ వేడుకల్లో పానీపూర్ స్టాల్ ఏర్పాటు చేసి అందర్నీ అక్కడ నిల్చోమనలేదు. ఓ అద్భుతమైన టెక్నిక్‌తో (Jugaad Video) అతిథులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పానీపూరీ సర్వ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


jaipal_chat_house ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ పెళ్లి వేడుకలో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వెయిటర్ తన చేతిలో పానీపూరీ ట్రే పట్టుకుని తిరుగుతున్నాడు. అతడి వీపు వెనుక ఓ గాజు సిలిండర్ లాంటిది ఉంది. పానీ ఉన్న ఆ సిలిండర్‌కు ఓ పైప్ అమర్చి ఉంది. ఎవరైనా పానీపూరీ తీసుకుంటే ఓ పైప్ ద్వారా పానీ వేస్తున్నాడు. చాలా ఈజీగా అందరికీ పానీపూరీ అందిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ విధానంలో పానీపూరీ సర్వ్ చేయడం ఎక్కడా ఎవరూ చూసుండరు.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 14 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``నేను మొదట దానిని చూసి దోమల మందు కొట్టే పరికరం అనుకున్నా``, ``పానీపూరీ వాలా లైఫ్ చాలా సులభం అవుతుంది``, ``మనదేశం ఎంతో పురోగమించింది``, ``గొప్ప ఆవిష్కరణ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ దృష్టికి స్పెషల్ టెస్ట్.. ఈ రెండు చేపల్లోని మూడు తేడాలను 8 సెకెన్లలో కనుక్కోండి...


Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..


Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..


Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2024 | 01:10 PM

Advertising
Advertising