ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మనదేశంలో కూడా పురుగులను తింటారా? వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 28 , 2024 | 05:20 PM

పురుగులు, బొద్దింకలు, పాములను తినే అలవాటు మనదేశంలో లేదని చాలా మంది భావన. అయితే మన దేశంలో కూడా పురాతన కాలంలో కొన్ని తెగల వారు పురుగులను ఇష్టంగా తినే వారని పేర్కొంటూ ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

eating insects in India

చైనీయుల ఆహారపు అలవాట్లపై (Chinese Food Habits) ప్రపంచవ్యాప్తంగా రకరకాల విమర్శలు వస్తుంటాయి. వాళ్లు పాములు, కప్పులు, పురుగులను తింటారని విమర్శిస్తుంటారు. మనదేశంలో నాన్-వెజ్ తినే చాలా మంది కోళ్లు, మేకలు, గొర్రెల వరకే పరిమితమవుతురు. ఇలా పురుగులు (Insects), బొద్దింకలను తినే అలవాటు మనదేశంలో లేదని చాలా మంది భావన. అయితే మన దేశంలో కూడా కొందరు పురుగులను ఇష్టంగా తింటారని పేర్కొంటూ ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


కర్ణాటకకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కావ్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కావ్య, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కీటకాలను తినే సాంప్రదాయం గురించి ప్రస్తావించింది. ఒడిశాలోని ఎర్ర చీమల నుంచి తయారు చేసే చట్నీ (red ant chutney) తింటారని, తమిళనాడు, కర్ణాటకల్లోని కొందరు చెద పురుగులతో వంట చేస్తారని పేర్కొంది.


అలాగే నాగాలాండ్‌కు చెందిన ప్రసిద్ధ ఫ్రైడ్ సిల్క్ వార్మ్ డిష్, మధ్యప్రదేశ్‌లోని మోరియా తెగల పురుగుల లార్వా వంటకం గురించి మాట్లాడింది. ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని తెలిపింది. చాలా మంది ఈ వంటకాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అయితే ఇవి భారతదేశ ప్రాచీన ఆహార సంస్కృతిలో భాగమని కావ్య చెప్పింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 32 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను వాటిని తినలేను. కానీ, వాటిని తినే వారిని హేళన చేయను``, ``రుచి కోసం ఒక చిన్న కీటకాన్ని కూడా చంపే హక్కు మనకు లేదు``, ``నేను తినే ఆహారంలో హింస, రక్తం ఉండకూడదు``, ``మన దేశంలో చాలా తక్కువ మందే పురుగులను తింటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..


Viral Video: పెళ్లి వేడుకలో వధువు హాట్ డ్యాన్స్.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన ఏంటంటే..

Viral Video: ఈ అంకుల్‌కు కొత్త బైక్ అయినా భార్య తర్వాతే.. వీడియో చూస్తే చిరునవ్వు చిందించాల్సిందే..


Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే తప్ప ఈ పజిల్ సాల్వ్ చేయలేరు.. ఈ పెయింటింగ్‌లో అమ్మాయిని కనిపెట్టండి..


Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..


Viral: అడవి ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహించిన గజరాజు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 28 , 2024 | 05:20 PM