ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పుడు తల్లికి... ఇప్పుడు కూతురికి...

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:02 AM

ఆమె పాట పాడితే కోట్లలో వ్యూస్‌... లక్షల్లో రీల్స్‌. ఏ భాషలో అయినా, ఏ పాట అయినా క్షణాల్లో వైరలవ్వాల్సిందే. బాలీవుడ్‌ ‘జవాన్‌’లోని ‘చలేయా’, ‘జైలర్‌’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ (తమిళ్‌ వెర్షన్‌), ‘గుంటూరు కారం’లో ‘ఓ మై బేబీ’ పాటలు చాలు... ఆమె టాలెంట్‌ను అంచనా వేయడానికి.

ఆమె పాట పాడితే కోట్లలో వ్యూస్‌... లక్షల్లో రీల్స్‌. ఏ భాషలో అయినా, ఏ పాట అయినా క్షణాల్లో వైరలవ్వాల్సిందే. బాలీవుడ్‌ ‘జవాన్‌’లోని ‘చలేయా’, ‘జైలర్‌’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ (తమిళ్‌ వెర్షన్‌), ‘గుంటూరు కారం’లో ‘ఓ మై బేబీ’ పాటలు చాలు... ఆమె టాలెంట్‌ను అంచనా వేయడానికి. ఇటీవల ‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటతో మరోసారి నెట్టింట టాప్‌ ట్రెండింగ్‌గా మారింది గాయని శిల్పారావు. ఆమె చెబుతున్న సంగీత ప్రయాణ సరిగమలివి...

షారుక్‌ నుంచి కాల్‌...

‘జవాన్‌’లోని ‘చలేయా’ పాట కోసం ఒక రోజు షారుక్‌ఖాన్‌ మేనేజర్‌ నాకు ఫోన్‌ చేసి, ‘ఒక పాట ఉంది. అది మీరు పాడితేనే బాగుంటుందని షారుఖ్‌ సర్‌ మిమ్మల్ని అడగమన్నారు’ అన్నారు. అది నాకు బిగ్గెస్ట్‌ కాంప్లిమెంట్‌లా ఫీలయ్యా. వెంటనే అనిరుధ్‌ని కలిసేందుకు చెన్నై వెళ్లా. మేమిద్దరం కలిసి కంపోజింగ్‌ రూంలో కూర్చుని ఇరవై నిమిషాల్లో సాంగ్‌ రికార్డింగ్‌ పూర్తి చేశాం. తర్వాత ఆ పాటని షారుక్‌ సర్‌కి పంపిస్తే, విని ‘చాలా బాగా వచ్చింద’న్నారు.


వాళ్లే నాకు స్ఫూర్తి..

నేను మా నాన్న దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. హరిహరన్‌, మెహదీ హసన్‌, అమెరికన్‌ సింగర్‌ పర్ల్‌ జామ్స్‌ ఎడ్డీ వెడ్డర్‌, బ్రిటీష్‌ సింగర్స్‌ స్టింగ్‌ వంటి వాళ్లు నాకు స్ఫూర్తి. నాకు ఇష్టమైన గాయకులు.. సునిధీ చౌహన్‌, శంకర్‌ మహదేవన్‌. నేను ఏఆర్‌ రెహమాన్‌, మణిరత్నం వంటి ప్రముఖులతో కలిసి పనిచేశా. మణి సర్‌ చాలా కూల్‌ పర్సన్‌. పనిలోనే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది.

ఇద్దరికీ పాడాను...

జాన్వీకపూర్‌ కోసం (చుట్టమల్లే చుట్టేస్తాంది) నేను పాడటం ఇదే మొదటిసారి. 12 ఏళ్ల క్రితం శ్రీదేవి గారి కోసం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ (టైటిల్‌ సాంగ్‌)లో పాడాను. నా అభిమాన హీరోయిన్‌ తబు. ఆమె సినిమాలో పాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. తెలుగులో మొదటిసారిగా ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ సినిమాలో ‘ఎగిరే..’, ‘అబ్బచ’ పాటలు పాడా. ‘గుంటూరు కారం’లో ‘ఓ మై బేబీ’ పాటకి ఎంతమంది, ఎన్ని రీల్స్‌ చేశారో లెక్కే లేదు.


జాగ్రత్తలు తప్పనిసరి..

ఎప్పుడూ వాయిస్‌ ఫ్రెష్‌గా ఉండాలంటే వోకల్‌ హెల్త్‌ బాగుండాలి. అందుకోసం సరైన విశ్రాంతి అవసరం. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా కంటి నిండా నిద్రపోతా. అలాగే గొంతు పోకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటా. ఎంత బిజీగా ఉన్నా సరే సంగీత సాధన మానను. అలాగే క్రమం తప్పకుండా త్రోట్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటా.


టెక్నిక్స్‌ ఫాలో అవుతా...

శాస్త్రీయ సంగీతంతో పాటు గజల్స్‌ కూడా నేర్చుకున్నా. నా ప్రతీ పాటలో గజల్‌, సూఫీ టెక్నిక్స్‌ వాడుతా. ‘ధూమ్‌ 3’లో మలంగ్‌, ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’లో ‘బుల్లెయా’, ‘పఠాన్‌’లో ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలు అలా పాడినవే. ఆ పాటలన్నీ జనాల్లోకి బాగా వెళ్లాయి. పాడిన ప్రతీ పాట మరింత కొత్తగా ప్రేక్షకులకు అందించాలనేదే నా ప్రయత్నం. ‘వార్‌’లో ‘గుంగ్రూ’, ‘పఠాన్‌’లోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలకు ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నా.


అలాంటి స్పందన ఊహించలేదు...

‘జైలర్‌’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ తమిళ్‌ వెర్షన్‌ పాడింది నేనే. రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్‌ సినిమాలో పాడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ పాట లిరిక్స్‌ తమిళం, తెలుగు మిక్స్‌ అయి ఉంటాయి. పైగా తమిళ్‌ నాకు అస్సలు రాదు. తెలుగు నా మాతృభాషే కాబట్టి పదాలు పలకడం తేలికే. కానీ తమిళ పదాలు స్పష్టంగా ఉచ్ఛరించేందుకు రెండు, మూడుసార్లు బాగా ప్రాక్టీసు చేశా. పాడేటప్పుడు లిరిక్స్‌లో ఏమైనా తప్పులు పలికితే వెంటనే అనిరుధ్‌ సరిచేసేవారు. పాట విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి పడ్డ కష్టమంతా మర్చిపోయా.

Updated Date - Sep 15 , 2024 | 07:02 AM

Advertising
Advertising