ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Relationship Tips: ఈ 5 లక్షణాలుంటే అమ్మాయిలు ఇష్టపడుతారట.. లేదంటే టాటా బైబై..!

ABN, Publish Date - Feb 29 , 2024 | 02:55 PM

Relationship Tips: సాధారణంగా మహిళలు(Women) తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ఏ బంధంలో(Relationship) అయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ కపుల్స్(Couple) మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవు. ప్రతికూల ఆలోచనలూ రావు. మహిళలు తమ భాగస్వామిని ఎంచుకునే ముందు ..

Relationship Tips

Relationship Tips: సాధారణంగా మహిళలు(Women) తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ఏ బంధంలో(Relationship) అయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ కపుల్స్(Couple) మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవు. ప్రతికూల ఆలోచనలూ రావు. మహిళలు తమ భాగస్వామిని ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారట. ముఖ్యంగా ఆ వ్యక్తి అలవాట్లను తెలుసుకుంటారట. ఆ లక్షణాలు లేకపోతే ఎంతటి అందగాడైన పట్టించుకోరట. మరి స్త్రీలు.. పురుషులలో ఏ అలవాట్లను గమనిస్తారు? ఇష్టపడుతారు? ఇక్కడ తెలుసుకోండి.

1. అన్నీ చెప్పాలి..

ఏదీ దాచుకోకుండా.. ఓపెన్‌గా మాట్లాడేవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారట. మాట్లాడటంలో ఏమాత్రం సంకోచం లేని వారిపై ఇతరుల్లో చెడు భావాలు ఉండవని, తద్వారా అలాంటి వారిని కోరుకుంటారట. సీక్రెట్స్ లేకుండా మాట్లాడటం ద్వారా ఇద్దరి సంబంధం కూడా బలోపేతం అవుతుంది.

2. భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి..

మహిళలు తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ప్రతి సంతోషకరమైన సంబంధానికి ఇది ముఖ్యం. ఏదైనా విషయంలో జడ్జ్ చేయకుండా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా కపుల్స్ మధ్య ఎలాంటి దూరం గానీ, ప్రతికూల ఆలోచనలు గానీ రావు.

3. మారమని చెప్పొద్దు..

సహజంగా, స్వంత స్వభావంతో ఉండేవారిని మహిళలు ఇష్టపడుతారట. అవసరానికి తగ్గట్లుగా మారే వ్యక్తులను అమ్మాయిలు ఇష్టపడరట. అంతకంటే ముఖ్యంగా.. నువ్ అలా ఉండు.. నువ్ ఇలా ఉండు అని చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలకు చెబుతుంటారు. కానీ, ఒకరి కోసం తాము మారడం వారికి అస్సలు ఇష్టం ఉండదట. అలాంటి రిలేషన్‌ను వారు దూరం చేసుకుంటారట.

4. గౌరవించాలి..

మహిళలకు వారి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఆత్మగౌరవం విషయానికి వస్తే అమ్మాయిలు తమకు ఇష్టమైన వారిని కూడా పక్కకు పెట్టేస్తారు. పొరపాటున కూడా స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు.

5. నమ్మకం..

స్త్రీలు తమ భాగస్వామికి విశ్వసనీయతతో ఉండాలని ఆకాంక్షిస్తారు. మనస్ఫూర్తిగా తమను ప్రేమించాలని కోరుకుంటారు. మోసాన్ని అస్సలు సహించరు. మోసం చేసే వారిని దగ్గరకు కూడా రానివ్వరు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 02:55 PM

Advertising
Advertising