ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ పూలు... అ‘ధర’హో!

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:17 AM

ప్రకృతి పచ్చదనంతో పాటు పూలపరిమ ళంతో గుబాళిస్తుంది. పువ్వుల్లో కొన్ని దైవాన్ని చేరితే, మరికొన్ని మహిళల సింగారంలో సేదతీరుతాయి. ఇంకొన్ని అత్తర్లు, ఔషధాల్లో పనికొస్తాయి. సాధారణంగా ఏ పూల ధరైనా సరే వంద రూపాయల్లోపే ఉంటుందనుకుంటారు...

ప్రకృతి పచ్చదనంతో పాటు పూలపరిమ ళంతో గుబాళిస్తుంది. పువ్వుల్లో కొన్ని దైవాన్ని చేరితే, మరికొన్ని మహిళల సింగారంలో సేదతీరుతాయి. ఇంకొన్ని అత్తర్లు, ఔషధాల్లో పనికొస్తాయి. సాధారణంగా ఏ పూల ధరైనా సరే వంద రూపాయల్లోపే ఉంటుందనుకుంటారు... కానీ అరుదైన, అత్యంత ఖరీదైనపుష్పాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో టాప్‌ 5 పూల విశేషాలివి...


- కుంకుమ పూలు

కుంకుమ పువ్వును అత్యంత ఖరీదైనదిగా చెప్పుకోవాలి. ఊదా రంగులో ఉండే పువ్వు మధ్యలో దారాల్లా సన్నని రేఖల్లా ఎర్రగా కనిపించేవి అసలుసిసలు కుంకుమపువ్వు. కశ్మీరులాంటి ప్రాంతాల్లో మంచుపడుతూ చల్లగా ఉండే సమయంలో కొండల్లో వేసే ఈ పంటను జాగ్రత్తగా కోయటం... వాటిని ఎండపెట్టి కుంకుమ పువ్వును తీయటం పెద్ద పనే. మంచి సువాసనతో పాటు వీటిలో ఔషధగుణాలు ఎక్కువ. కూలీలు 40 గంటల పాటు పనిచేసి 1 లక్షా 50 వేల పూలను కోస్తే... వాటిలో కేవలం కిలో కుంకుమపువ్వు మాత్రమే లభిస్తుంది. కాబట్టే వీటి ధర ఎక్కువ. ఇందులో మూడు గ్రేడ్స్‌ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో మూడోరకం కుంకుమపువ్వు కిలో ధర సుమారు 40 వేల రూపాయల నుంచి 80వేల దాకా ఉంటుంది. మధ్యరకం రూ. 80 వేల నుంచి లక్షన్నర దాకా పలుకుతుంది. ఇరాన్‌, కశ్మీర్‌, స్పెయిన్‌, గ్రీస్‌, మొరాకో దేశాల్లో దొరికే కుంకుమ పువ్వు అత్యంత నాణ్యమైనది. దీని ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల పైమాటే.


- గోల్డ్‌ ఆఫ్‌ కినబాలు

ఈ పూలను ‘కింగ్‌ ఆఫ్‌ ఆర్చిడ్స్‌’ అని పిలుస్తారు. ఆకుపచ్చ, ఎరుపు పెటల్స్‌ ఉండే వీటిని కొన్ని దేశాల్లో అమ్మటం, పండించటం నేరం. అంతర్జాతీయ మార్కెట్లో ఇవి కనపడవు. అందుకే గిరాకీ ఎక్కువ. మలేషియాలోని ‘మౌంట్‌ కినబాలు’ అనే కొండల్లో మాత్రమే పూస్తాయి. వేడి, చలి ఉష్ణోగ్రతలుండే మే నెలలో ఈ పూలు విచ్చుకుంటాయి. మొక్కలకు పువ్వు పూయటానికే నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. పూలు పూయటానికి సిద్ధంగా ఉండే కినబాలు ఆర్చిడ్‌ మొక్క ధర సుమారు 40 వేల రూపాయలుంటుంది. పూలతో సిద్ధంగా ఉండే చెట్టు విలువ రూ. 4 లక్షల ధర పలుకుతుంది. అంటే పూల ధర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు!


- సెంజన్‌ నాన్‌కే

చైనాలోని సెంజన్‌ నాన్‌కే గ్రూప్‌ తయారు చేసిన మ్యాన్‌మేడ్‌ ఫ్లవర్‌ ఇది. ఎనిమిదేళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ పూల చెట్టును అభివృద్ధి చేశారు. ఆకుపచ్చ, గులాబీ రంగులో సున్నితమైన పెటల్స్‌ ఉంటాయి. నాలుగైదేళ్లకోసారి మాత్రమే ఈ చెట్టు పువ్వులు పూస్తుంది. అరవై సెంటీమీటర్లుండే ఈ పూలన్నీ ఒకే కాండానికి పూస్తాయి. చైనా ఉత్పత్తి చేసిన ఈ పూలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 4 లక్షల రూపాయల నుంచి 8 లక్షల దాకా ధర పలుకుతాయి. ఈ పూల చెట్లు చైనాలో సెంజన్‌ నాన్‌కే బొటానికల్‌ గార్డెన్‌లో మాత్రమే ఉన్నాయి.


- కడుపూల్‌

పన్నెండు అంగుళాల పొడవైన తెల్లని పెటల్స్‌ ఉండే ‘కడుపూల్‌’ పువ్వు అరుదైన కాక్టస్‌ జాతికి చెందినది. మధ్య, దక్షిణ అమెరికాతో పాటు శ్రీలంక, భారత్‌లో మాత్రమే ఈ పూల చెట్లు బతుకుతాయి. పున్నమి చంద్రుడిలా ఉండే ఈ పూలను మహిమాన్వితంగా కొలుస్తారు. నవంబర్‌ నుంచి మార్చి నెల దాకా పూస్తాయి. వీటి జీవితకాలం చాలా తక్కువ. ఈ ప్రత్యేకత వల్ల వీటికి డిమాండ్‌ ఎక్కువ. పూల ధర ఒక్కోటి 16 వేల రూపాయల దాకా ఉంటుంది.


- నల్లని పూలు

నల్లని పూలు కనపడటమే కష్టం. ‘బ్లాక్‌ ఆర్చిడ్‌’ అందంగా ఉండకపోయినా.. గిరాకీ ఉంది. ఇండోనేషియాలో దొరికే ఈ పూల చెట్ల విత్తనాల ధరనే లక్షల్లో పలుకుతుంది. ఇండోనేషియన్లే కాదు... ఇతర దేశాల పూల ప్రేమికులు వీటిని వెతుక్కుని మరీ వస్తారు. ఎండాకాలంలో ఈ పూలు పూస్తాయి. ఫంక్షన్లలో వేదికల అలంకరణకు మిగతా పూలతో కలిపి డెకరేషన్‌ కోసం వాడతారు. ఒక్కో పూల రెమ్మ 24 వేల నుంచి 40 వేల రూపాయలకు పైగా ఉంటుంది.

Updated Date - Oct 20 , 2024 | 08:17 AM