ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: నువ్వు ఎప్పటికీ సింగిల్‌గా మిగిలిపోతావ్.. మహిళపై విమర్శల వర్షం.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Apr 04 , 2024 | 03:35 PM

తనకు కాబోయే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలేంటో చెప్పి నెట్టింట సంచలనం సృష్టిస్తున్న మహిళ

ఇంటర్నెట్ డెస్క్: జీవిత భాగస్వామి గురించి ప్రతి ఒక్కరికీ కొన్ని ఆశలు, అంచనాలు ఉంటాయి. ఎన్ని అంచనాలు ఉన్నా కొందరు పరిస్థితులతో రాజీ పడి సర్దుకుపోతుంటారు. అయితే, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో (Requirements) చెబుతూ ఓ మహిళ పెట్టిన మెసేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

ముంబైకి చెందిన ఓ 37 ఏళ్ల అవివాహిత మహిళ (Mumbai Woman) పెట్టి పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆమె పెట్టిన మెసేజీని ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేశాడు. మరాఠీలో ఆ మెసేజీని ఇంగ్లీష్‌లో అనువదించి జనాలతో పంచుకున్నాడు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె సంవత్సరానికి రూ.4 లక్షలు సంపాదిస్తోంది.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

అయితే, ఆమెకు కాబోయే భర్త మాత్రం ఏడాదికి రూ. కోటిపైనే సంపాదించాలట (Groom with rs, 1crore Income). కాబోయే వాడు జాబ్ అయినా వ్యాపారం చేసినా తనకు ఓకే అని చెప్పిందా మహిళ. సర్జన్ కానీ సీఏ గానీ చేసుంటే బెటరని చెప్పింది. డైవర్సీలు వద్దట. సొంతిల్లు ఉండాలని చెప్పుకొచ్చింది.


ఆమె కోరికలు విన్న జనాలు షాకైపోతున్నారు. ఇలా అయితే లైఫంతా సింగిల్‌గానే ఉండిపోతావంటూ తిట్టిపోశారు. భారత్‌లో రూ.కోటికి పైగా సంపాదించే వారు చాలా తక్కువ అని, కాబట్టి ఆమెకు పెళ్లే కాదని తేల్చి చెప్పారు. రూ. కోటి సంపాదించేవారు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకుంటారని మరికొందరు అన్నారు.

Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే..

అయితే, నెటిజన్లలో కొందరు మాత్రం ఆమె అభిప్రాయాలను సమర్థించారు. ఎలాంటి భాగస్వామి కావాలో ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.

మహిళకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదేమో అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల పోరు పడలేక ఇలాంటి కండీషన్లతో పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 03:42 PM

Advertising
Advertising