ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బాస్ తనని తెగ తిడుతున్నాడని ఈ యువతి ఏం చేసిందంటే..

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:33 PM

ఉత్తరాది నుంచి వచ్చిన బాస్ తనని తెగ తిడుతున్నాడని ఓ దక్షిణాది యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. తనకు హిందీ రాదని చెప్పడంతో బాస్ ఇంగ్లిష్‌లో ఎక్కుసేపు గొంతు చించుకోలేక సైలెంటైపోయాడని చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జమానాలో ఉద్యోగ జీవితాల్లో ఒత్తిడి పెరిగిపోతోంది. ఆఫీసులో టార్గెట్స్, కొలీగ్స్ తో గొడవలు, బాస్ తో తిట్లు.. వెరసి ఉద్యోగులకు ప్రశాంతత అనేదే కరువైంది. దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్న ఓ యువతి చిన్న చిట్కాతో కొంత సాంత్వన పొందింది. ఇటీవలే ఆమె తన ఐడియాను నెట్టింట పంచుకోవడంతో జనాలు ఆమె తెలివికి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.

Viral: వామ్మో.. సింహాల్లో ఈ యాంగిల్ కూడా ఉందా? అద్భుత దృశ్యం!


యువతి చెప్పిన దాని ప్రకారం, ఆమెది చెన్నై. ఆమె పని చేసే కంపెనీని ఓ ఉత్తరాది వ్యక్తి స్థాపించాడు. తమిళం రాదు. అయితే, యువతి బాస్ కు నిత్యం ఉద్యోగులపై నోరుపారేసుకోవడం అలవాటట. హిందీలో తిడుతూ ఉద్యోగులకు చుక్కలు చూపించేవాడట. తాను కూడా కొన్ని సార్లు బాస్ నోటికి బలైపోయానని చెప్పింది. చివరకు ఓ చిట్కా ప్రయోగించి పరిస్థితి నుంచి బయటపడ్డానని చెప్పింది. ఓ రోజు బాస్ తనను తిట్టేందుకు వస్తే తనకు హిందీ రాదని చెప్పానని ఆమె వివరించింది. దీంతో, బాస్ ఇంగ్లిష్‌లో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయాడని అంది. నాటి నుంచి బాస్ తనని ఆడిపోసుకోవడం కాస్త తగ్గించాడని చెప్పుకొచ్చింది (This Chennai Woman’s Hack To Avoid Boss' Yelling Is Hilarious).


యువతి తెలివితేటలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. భాషను అడ్డుపెట్టుకుని బాస్ ను బాగా బోల్తా కొట్టించావని ప్రశసించారు. కొందరు మాత్రం ఇంగ్లిష్ తిడితే పర్లేదా హిందీ తిడితే కుదరదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అలాంటి ఓ వ్యక్తికి యువతి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆఫీసులో వాతావరణంలో ఇమడలేక చేరిన ఏడు నెలలకే మానేశానని చెప్పింది. దీంతో, యువతి నిర్ణయానికి అనేక మంది మద్దతు తెలిపారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 12:39 PM

Advertising
Advertising