Viral: 150 ఏళ్ల బతకాలనుకుంటున్న దంపతులు.. అందుకోసం వారు ఏమేం చేస్తున్నారో తెలిస్తే..
ABN, Publish Date - Oct 09 , 2024 | 05:26 PM
ఆరోగ్య సూత్రాలు పాటించే వారు 80 నుంచి 90 ఏళ్ల వరకు జీవిస్తారు. ఇక, కొందరు అసాధారణ వ్యక్తులు 100 ఏళ్లకు పైగానే మనుగడ సాగిస్తారు. అయితే ఒక వ్యక్తి 150 సంవత్సరాలు జీవించగలడని మీరు నమ్ముతారా? అమెరికాలోని మిడ్‌వెస్ట్‌లో నివసిస్తున్న ఒక జంట అందుకోసం సన్నాహాలు చేస్తోంది.
సాధారణంగా మనుషులు ఎంత కాలం బతుకుతారు? సగటున ఓ వ్యక్తి జీవిత కాలం (Life span) 70 ఏళ్లుగా భావించవచ్చు. ఆరోగ్య సూత్రాలు (Healty Lifestyle) పాటించే వారు 80 నుంచి 90 ఏళ్ల వరకు జీవిస్తారు. ఇక, కొందరు అసాధారణ వ్యక్తులు 100 ఏళ్లకు పైగానే మనుగడ సాగిస్తారు. అయితే ఒక వ్యక్తి 150 సంవత్సరాలు జీవించగలడని మీరు నమ్ముతారా? అమెరికా (America)లోని మిడ్‌వెస్ట్‌లో నివసిస్తున్న ఒక జంట అందుకోసం సన్నాహాలు చేస్తోంది. మిడ్‌వెస్ట్‌కు చెందిన కైలా బార్న్స్ వయసు 33 సంవత్సరాలు. ఆమె భర్త వారెన్ లెంట్స్ వయసు 36 సంవత్సరాలు. వారిద్దరూ కలిసి 150 సంవత్సరాలు జీవించాలని ప్లాన్ చేసుకుంటున్నారు (Viral News).
సుదీర్ఘ జీవిత కాలం కోసం వారిద్దరూ బయోహాకింగ్ రొటీన్‌ను పాటిస్తున్నారు. వారిద్దరూ ఉదయం లేవగానే పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ చేయించుకుంటారు. అందుకోసం ఇంట్లోనే వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మార్నింగ్ వాక్ చేసి సన్ బాత్ కూడా చేస్తారు. ఆ తర్వాత వారు రోజంతా వైద్య పరికరాల సహాయంతో వివిధ థెరపీలు చేయించుకుంటారు. అందుకోసం హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానో V వంటి సెల్ రిపేరింగ్ పరికాలను ఉపయోగిస్తారు. స్వయంగా తయారు చేసుకున్న భోజనాన్నే తీసుకుంటారు. సుదీర్ఘంగా వాకింగ్ చేస్తారు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతారట.
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో పూర్తిగా ఎరుపు రంగు దీపాలను వాడతారట. అవి శరీరంలో మెటబాలిజమ్‌ను పెంచుతాయట. రోజులో తొమ్మిది గంటలు పూర్తిగా నిద్రకే కేటాయిస్తారట. ప్రస్తుతం వారు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. తామిద్దరం కలిసి వందేళ్లకు పైగా ఆరోగ్యవంతంగా జీవిస్తామని కైలా, వారెన్ నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం వైద్య సహకారం తీసుకుంటూనే ఆర్గానిక్ తరహాలో జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో స్వచ్ఛమైన గాలి అందించే మెషిన్లనే ఉపయోగిస్తారట.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 09 , 2024 | 05:27 PM