Viral Video: అధిక తెలివితేటలంటే ఇవే.. ఈ ఫ్యాన్‌ను ఆపాలంటే కరెంట్ పోవాల్సిందే..షాకవుతున్న నెటిజన్లు!
ABN, Publish Date - Jun 28 , 2024 | 11:02 AM
చాలా మంది తమ తెలివితేటలను ఉపయోగించి అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలివి శృతిమించినపుడు మాత్రం ప్రయోగాలు వికటిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది.
చాలా మంది తమ తెలివితేటలను (Intelligence) ఉపయోగించి అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలివి శృతిమించినపుడు మాత్రం ప్రయోగాలు వికటిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆ వ్యక్తి తెలివి చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. దాని వెనుక ఉన్న లాజిక్ (Logic) గురించి ఆలోచిస్తూ మీరు మీ తల గోక్కోవడం ఖాయం. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Viral Video).
sachkadwahai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తెల్ల సీలింగ్ ఫ్యాన్ (Fan) కనిపిస్తోంది. అయితే ఆ ఫ్యాన్‌ను ఆన్ చేయడం, ఆపడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఫ్యాన్‌కు స్విచ్ లేదు. పైన ఉన్న సీలింగ్‌కు రెగ్యులేటర్ అమర్చి దానికి ఫ్యాన్‌ను డైరెక్ట్‌గా కనెక్ట్ చేశారు. ఫ్యాన్ ఆన్ చేసేందుకు ఓ వ్యక్తి పట్టుకారుతో ఆ రెగ్యులేటర్‌ను తిప్పాడు. కానీ, ఆ ఫ్యాన్ తిరుగుతుండగా ఆపడం మాత్రం సాధ్యం కాదు. కరెంట్ పోయి ఫ్యాన్ ఆగడం తప్ప మనం ఆపాలనుకుంటే ఆపడం వీలుపడదు.
ఫ్యాన్‌కు స్విచ్ పెట్టకుండా రెగ్యులేటర్‌ను అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక చాలా మంది బుర్రలు బద్దలుగొట్టుకుంటున్నారు. దాని వెనుకున్న లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ```ఈ ఫ్యాన్ కంట్రోల్ పూర్తిగా ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ చేతుల్లో ఉంటుంది``, ``మీరు అన్ని హద్దులూ దాటేశారు``, ``మీ తెలివికి నా జోహార్లు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 28 , 2024 | 11:02 AM