Viral Video: ఈ ఏనుగు సైజ్ మాత్రమే కాదు.. మనసు కూడా చాలా పెద్దది.. వీడియో చూస్తే దీనిని ప్రేమించకుండా ఉండలేరు..
ABN, Publish Date - Dec 15 , 2024 | 06:00 PM
సాధారణంగా ఏనుగులు తనకు హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ఇతర జీవులపై దాడికి దిగుతాయి. లేకపోతే ఇతర జంతువులతో చాలా ప్రేమపూర్వకంగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఏనుగు మంచి మనసు ఏంటో అర్థమవుతుంది.
అత్యంత భారీ శరీరం కలిగిన ఏనుగును (Elephant) అత్యంత తెలివైన జంతువుగా కూడా పరిగణిస్తారు. శాకాహారి అయిన ఏనుగు సాధ్యమైనంత వరకు ఇతర జీవులకు హాని కలిగించకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. తనకు హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ఇతర జీవులపై దాడికి దిగుతుంది. లేకపోతే ఇతర జంతువులతో చాలా ప్రేమపూర్వకంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను (Elephant Video) చూస్తే ఏనుగు మంచి మనసు ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే ఏనుగును ప్రేమించకుండా ఉండలేరు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది (Viral Video).
@WildfriendsUG అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ ఏనుగు అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో దానికి అడవి పందులు (warthogs) గుంపు ఎదురైంది. పందులు ఏనుగు కాళ్లకు అడ్డుపడి నేల మీద గడ్డిని తింటున్నాయి. వాటిని చూసిన ఏనుగు అడుగు ముందుకు వేయడానికి ఆలోచించింది. కాళ్ల చుట్టూ అటూ ఇటూ అడవి పందులు తిరుగుతుండడంతో ఆగిపోయింది. తన కాలి కింద నలిగి అవి ఎక్కడ చనిపోతాయో అని భయపడింది. చాలా సేపు కాలు ఎత్తి గాలిలో అలాగే ఉంచేసింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 7 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఏనుగు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అమోఘం``, ``దేవుడు మనకు ఇచ్చిన అందమైన బహుమతులలో ఏనుగు కూడా ఒకటి``, ``ఆ ఏనుగును ప్రేమించకుండా ఉండలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..
Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..
Picture puzze Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ బీచ్‌లోని ఆరు డబ్బు సంచులను పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 15 , 2024 | 06:01 PM