Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..
ABN, Publish Date - Oct 07 , 2024 | 07:06 AM
క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ సాయంతో తాను ఐఫోన్ 16ను కేవలం రూ.29 వేలకే కొనుగోలు చేశానని ఓ వ్యక్తి చెప్పిన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. కొంత మంది అతడికి కంగ్రాట్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తు్న్నారు. అతడు రివార్డ్ పాయింట్స్ వృథా చేశాడని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ 16 సిరీస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపై చర్చే. యాపిల్ అభిమానులు ఎప్పటిలాగే ఈ కొత్త సిరీస్ ఫోన్ సొంతం చేసుకునేందుకు షాపుల ముందు క్యూకడుతున్నారు. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఐఫోన్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ, దాని ఖరీదు చూసి వెనకడుకు వేస్తారు. కొత్త సిరీస్‌లో ప్రాథమిక వేరియంట్ ధరే రూ.70 వేలు దాటగా హైఎండ్ ఫోన్ ధర రూ.1.4 లక్షలు దాటింది. ఇలాంటి పరిస్థితి ఓ వ్యక్తి ఐఫోన్ 16ను కేవలం రూ.27 వేలకే సొంతం చేసుకున్నానని చెప్పడం నెట్టింట సంచలనంగా (viral) మారింది.
Inflation: మీ వద్ద రూ.కోటి ఉందా! 2050 కల్లా ఆ విలువ ఎంత తగ్గుతుందో తెలిస్తే..
ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో సదరు వ్యక్తి ఈ విషయాన్ని పంచుకున్నాడు. తాను హెడ్‌డీఎఫ్‌సీ ఇన్‌ఫినియా క్రెడిట్ కార్డు వాడి ఇంత తక్కువ ధరకు కొన్నట్టు చెప్పుకొచ్చాడు. అతడు పేర్కొన్న వివరాల ప్రకారం, 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.89,900. అయితే, అతడు అప్పటికే ఈ కార్డుపై చాలా షాపింగ్ చేసి ఉండటంతో రూ.62,930 విలువైన రివార్డు పాయింట్స్ వచ్చాయి. అసలే ఐఫోన్ అభిమాని అయిన అతడు ఈ రివార్డు పాయింట్స్ అన్నీ ఐఫోన్ కొనుగోలుపై వినియోగించేశాడు. ఇలాంటి పని చేసినందుకు చివరకు విచారం వ్యక్తం చేశాడు. ‘‘రివార్డు పాయింట్స్ దయవల్ల లేను ఐఫోన్ కొనుక్కున్నాను. కానీ ఇలా చేసినందుకు ఇప్పుడు విచారిస్తున్నాను’’ అని పోస్టు పెట్టాడు.
Viral: వీడేం దొంగరా బాబూ! చోరీకొచ్చి.. అంట్లు తోమి..బట్టలు ఉతికి.. ఆపై..
అతడి కామెంట్ వింతగా ఉండటంతో ఈ ఉదంతం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఎందుకు విచారమంటూ జనాలు ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో చివరకు అతడు సమాధానం ఇచ్చాడు. బంగారు ఆభరణాల కొనుగోలుపై హెడ్‌డీఎఫ్‌సీ రివార్డు పాయింట్స్ ఇవ్వదేమోనని తాను అమెజాన్ పే కార్డుపై 1 శాతం క్యాష్ బ్యాక్‌తో నగలు కొన్నానని, కానీ హెడ్‌సీఎఫ్‌సీ ఇన్‌ఫీనియా కూడా రివార్డు పాయింట్స్ ఇస్తుందని తాజా తెలిసిందని అన్నాడు. ఇది ముందే తెలిసుంటే తాను ఇన్‌ఫీనియా కార్డుతో తాను ఐఫోన్‌కు బదులు ఆభరణాలు కొనుగోలు చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. అసలు అన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా సాధ్యమైందని కొందరు ప్రశ్నించగా ఆ కార్డుతో తాను ఇప్పటివరకూ రూ.15 లక్షల విలువైన కొనుగోళ్లు చేసినట్టు వివరించాడు. ఇక అనేక మంది తాము ఐఫోన్ కొనుగోలు చేసేందుకు రివార్డ్ పాయింట్స్ వాడలేకపోతున్నామని అన్నారు. కొందరు మాత్రం ఈ పాయింట్స్ మొత్తాన్ని ఐఫోన్‌పై ఖర్చు పెట్టినందుకు పెదవి విరిచారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.
Viral: తొలిసారి ఇడ్లీని రుచి చూసిన రష్యా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..
Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్
Updated Date - Oct 07 , 2024 | 07:11 AM