Viral Video: వార్నీ.. మ్యాంగో జ్యూస్ ఇలా తయారు చేస్తారా.. ఈ వీడియో చూశాక కూడా తాగారంటే మీకు హ్యాట్సాఫ్..
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:45 PM
మీకు మామిడి పళ్లు అంటే ఇష్టమా? అలాగే మామిడి పళ్ల రసం కూడా తాగుతుంటారా? ఆఫ్ సీజన్‌లో దుకాణాల్లో అమ్మే మ్యాంగ్ జ్యూస్‌ను ఇష్టంగా తాగుతారా? టెట్రా ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ అంటే సేఫ్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూశాక మీకు దిమ్మతిరగడం ఖాయం.
మీకు మామిడి పళ్లు (Mangoes) అంటే ఇష్టమా? అలాగే మామిడి పళ్ల రసం (Mango juice) కూడా తాగుతుంటారా? ఆఫ్ సీజన్‌లో దుకాణాల్లో అమ్మే మ్యాంగ్ జ్యూస్‌ను ఇష్టంగా తాగుతారా? టెట్రా ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ అంటే సేఫ్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూశాక మీకు దిమ్మతిరగడం ఖాయం. ఎందుకంటే ఆ టెట్రా ప్యాకేజ్డ్ మ్యాంగ్ జ్యూస్‌లో (Tetra pack mango juice) మామిడి అనేది అసలు ఉండనే ఉండదు. ఓ ఫ్యాక్టరీలో మ్యాంగో జ్యూస్ తయారవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. yourbrownasmr అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మ్యాంగ్ జ్యూస్ తయారీ వీడియో చూస్తే మాత్రం ఇక మీ జీవితంలో ఈ జ్యూస్ ముట్టుకోరు. మ్యాంగో జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ వీడియోను రికార్డ్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో నీటిలో రకరకాల ఫుడ్ కలర్లను వేసి మిక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత అందులో పంచదార, చిక్కగా ఉన్న పసుపు రంగు ద్రావణాన్ని వేసి మిక్స్ చేశారు. బాగా ప్రాసెస్ చేసిన ఆ లిక్విడ్‌ను ప్లాస్టిక్ బకెట్లలోకి వేసి ఆ తర్వాత వాటిని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి సీల్ చేస్తున్నారు. ఇలా తయారైన జ్యూస్‌ని మార్కెట్లోకి డెలివరీ చేయడానికి సిద్ధం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 22 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``అవి కేవలం కలర్స్ మాత్రమే.. నిజమైన ఫ్రూట్ జ్యూస్‌లు కావు``, ``కలర్, పంచదార, కెమికల్స్``, ``ఇండియా వంటి పెద్ద మార్కెట్లో ఇలాగే వ్యాపారం చేయాలి``, ``స్మోకింగ్ అలవాటు లేకపోయినా ప్రజలకు కేన్సర్ రావడానికి ఇవే కారణం``, ``వాళ్లు కేన్సర్‌ను ప్యాక్ చేస్తున్నారు`` అంటూ నెటిన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్
Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..
Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 30 , 2024 | 03:45 PM