ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ చిన్న ట్రిక్‌తో ఎలా మోసం చేస్తున్నారో చూడండి.. కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యాపారి!

ABN, Publish Date - Jun 25 , 2024 | 12:17 PM

మనం మార్కెట్‌కు వెళ్లి పళ్లు, కూరగాయలు కొనేటపుడు వ్యాపారాలు తూకం వేసి ఇస్తుంటారు. మనం ఎంత అడిగితే అంత కొలిచి ఇస్తారు. ఆ తూకంలో మోసం జరుగుతుందని చాలా మందికి తెలుసు. కానీ ఆ మోసాన్ని ఎలా కనిపెట్టాలో చాలా మందికి తెలియదు. చాలా మంది త్రాసుకు అయస్కాంతం పెట్టి మోసం చేస్తుంటారు.

Cheating in weighing

మనం మార్కెట్‌కు వెళ్లి పళ్లు (Fruits), కూరగాయలు (Vegetables) కొనేటపుడు వ్యాపారులు (Sellers) తూకం వేసి ఇస్తుంటారు. మనం ఎంత అడిగితే అంత కొలిచి ఇస్తారు. ఆ తూకంలో (weighing machine) మోసం జరుగుతుందని చాలా మందికి తెలుసు. కానీ ఆ మోసాన్ని (Cheating) ఎలా కనిపెట్టాలో చాలా మందికి తెలియదు. చాలా మంది త్రాసుకు అయస్కాంతం పెట్టి మోసం చేస్తుంటారు. అయితే కొందరు చాలా సులభంగా వినియోగదారులను బోల్తా కొట్టిస్తుంటారు. ఆ ట్రిక్‌ను తాజాగా ఓ వ్యాపారి వివరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


imranmalik077 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బుట్టలో ఉన్న సపోటా పళ్లను విక్రయిస్తున్నాడు. బుట్టలోని పళ్లను త్రాసులో వేస్తున్నాడు. అయితే పళ్లు వేసున్న వైపు ఉన్న గొలుసును రకరకాలుగా మార్చడం ద్వారా తూకం ఎలా మారుతుందో స్పష్టంగా వివరించాడు. ఇలాంటి సింపుల్ ట్రిక్ ద్వారా ప్రజలను చాలా సులభంగా మోసం చేస్తున్నారు. మోసం ఎలా జరుగుతోందో కూడా కనిపెట్టలేరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 4.1 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``స్కామ్‌లను ఎలా నివారించాలో అంకుల్ చెప్పారు``, ``ఇది మోసమా? వ్యాపారి నైపుణ్యమా``, ``వ్యాపారం అంటే మోసమే``, ``నా ప్రొఫెసర్ కంటే అతనికి ఎక్కువ ఫిజిక్స్ తెలుసు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కూతురిని మంటల మధ్య వదిలేసి భార్యపై ప్రేమ.. నెటిజన్లు ఫైర్!


Optical Illusion: మీవి నిజంగా డేగ కళ్లు అయితే ఈ ఫొటోలో మూడు కాళ్లతో ఉన్న మూడు గుర్రాలను వెతకండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 25 , 2024 | 12:17 PM

Advertising
Advertising