Viral Video: కొనకపోతే ఏం చేస్తాడో ఏంటో.. ? ఓ వ్యాపారి పుచ్చకాయలను ఎలా అమ్ముతున్నాడో చూడండి..
ABN, Publish Date - May 18 , 2024 | 04:25 PM
వేసవి కాలం వచ్చిందంటే రుచికరమైన ఫలాలు మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే పుచ్చకాయను పిల్లలు, పెద్దలతో సహా అందరూ ఇష్టపడతారు. పళ్ల వ్యాపారాలు బిజీ బిజీగా గడుపుతారు. వినియోగదారులతో మంచిగా మాట్లాడి తమ విక్రయాలను పెంచుకుంటారు.
వేసవి కాలం (Summer) వచ్చిందంటే రుచికరమైన ఫలాలు (Fruits) మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. ముఖ్యంగా వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే పుచ్చకాయను పిల్లలు, పెద్దలతో సహా అందరూ ఇష్టపడతారు. పళ్ల వ్యాపారాలు బిజీ బిజీగా గడుపుతారు. వినియోగదారులతో మంచిగా మాట్లాడి తమ విక్రయాలను పెంచుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వ్యక్తి వెరైటీగా అమ్ముతున్నాడు. ఎర్రటి పుచ్చకాయను (Water melon) చూసిన తర్వాత మీ మనస్సు టెంప్ట్ అయినా, దానిని అమ్ముతున్న వ్యక్తి స్టైల్ చూసి భయం వేయవచ్చు (Viral Video).
foreverr_meme అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలోని వ్యక్తి బండిపై పుచ్చకాయలు అమ్ముతున్నాడు. అ సమయంలో అతడి చర్యలను చూసి ఎవరైనా భయపడతారు. ఆ వ్యక్తి పుచ్చకాయను కోసి, దానిని చూపించి, నోరు తెరిచి బిగ్గరగా అరుస్తున్నాడు. అక్కడితో ఆగకుండా తలపై స్టీల్ ట్రేతో కొట్టుకుని వింతగా అరుస్తున్నాడు. అతడి చేష్టలు చూసి చుట్టూ ఉన్న వారు పగలబడి నవ్వుకుంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది అల్ట్రా ప్రో మ్యాక్స్ స్టైల్``, ``వెరైటీ మార్కెటింగ్ స్ట్రాటజీ``, ``తన కుటుంబానికి ఆహారం అందించడం కోసం అతడు ఇన్ని పాట్లు పడుతున్నాడు``, ``అతడి యాక్టింగ్ బాగుంది``, ``అక్కడ కొనకపోతే ఊరుకోడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ ఏనుగులకు ఇంత క్రమశిక్షణ ఎవరు నేర్పారు? ఎంత పద్ధతిగా వ్యాన్ ఎక్కుతున్నాయో చూడండి..
Opitcal Illusion: మీ కళ్లకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పులిని 9 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2024 | 04:25 PM