ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మన దేశంలోనే ఇలాంటివి సాధ్యం.. రైలును ఎలా మార్చారో చూడండి.. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే..

ABN, Publish Date - Jul 19 , 2024 | 11:43 AM

మన దేశంలో ప్రతిరోజూ కొన్ని లక్షల మంది రైలు (Train) ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సుఖంగా రైలు ప్రయాణం (Train Journey) చేయడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. రైలు ప్రయాణంతో పోలిస్తే బస్సు ప్రయాణం ఎక్కువ ఖరీదు, తక్కువ సౌకర్యవంతం.

Train bus

మన దేశంలో ప్రతిరోజూ కొన్ని లక్షల మంది రైలు (Train) ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సుఖంగా రైలు ప్రయాణం (Train Journey) చేయడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. రైలు ప్రయాణంతో పోలిస్తే బస్సు ప్రయాణం ఎక్కువ ఖరీదు, తక్కువ సౌకర్యవంతం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో రైలో, బస్సో అర్థం కాని ఓ వాహనం చూసే వారిని అయోమయానికి గురి చేస్తోంది. బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆ రైలును చూసిన చాలా మంది తమ కళ్లను తామే నమ్మలేకపోయారు (Viral Video).


@Captainknows2 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ముందుగా లాంగ్ వ్యూలో ఓ రైలు కనిపిస్తోంది. తీరా చూస్తే అక్కడ పట్టాలు లేవు. అది రైల్వే స్టేషన్ కాదు. కెమెరాను దగ్గరగా తీసుకెళ్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆ రైలు భోగీలకు కింద ఇనుప చక్రాలకు బదులు, సాధారణ టైర్లు (Tyres to trains) అమర్చి ఉన్నాయి. అంటే పాడైపోయిన రైలు భోగీలను అలా బస్సులుగా మార్చేశారు. నిజానికి అది ఎక్కడకూ కదల లేదు. అక్కడే అలా నిలబడి ఉంటుంది. కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే దానిని ఉపయోగిస్తుంటారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``మనదేశంలోనే ఇలాంటివి సాధ్యం``, ``మీరు రైలు రోడ్ ట్రిప్‌నకు వెళ్లాల్సి వచ్చినపుడు``, ``మేం విపత్తును అవకాశంగా మార్చుకుంటాము`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఈ బండిని రాత్రి చూస్తే దడుసుకోవాల్సిందే..! సిగరెట్ బండిని ఎలా డిజైన్ చేశారో చూడండి..!


Optical Illusion: అక్కడ రాళ్లే కాదు.. ఓ ఉంగరం కూడా ఉంది.. ఫోకస్ పెట్టి 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2024 | 11:43 AM

Advertising
Advertising
<