ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇది మామూలు కేక్ కాదు.. 77 ఏళ్ల క్రితం నాటి ఈ కేక్‌ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:41 PM

క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ 1947లో జరిగిన తమ వివాహ వేడుకలో ఓ భారీ కేక్‌ను కట్ చేశారు. ఆ కేక్ ముక్కను 77 సంవత్సరాల తర్వాత తాజాగా వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది. ఈ కేక్ ముక్కకు ``వేరీ రేర్ స్లైస్`` అని పేరు పెట్టారు. అయితే ఈ కేక్ ముక్క మాత్రం తినదగినది కాదు.

Royal Wedding Cake Auction

గ్రేట్ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II (Queen Elizabeth II), ప్రిన్స్ ఫిలిప్ (Prince Philip) గురించి ప్రపంచం మొత్తం తెలుసు. వీరిద్దరికీ 1947, నవంబర్ 20వ తేదీన లండన్‌లో అత్యంత ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహానికి ఎందరో అతిరథ మహారథులు, పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఆ వివాహ మహోత్సవంలో క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ భారీ కేక్‌ను (Wedding Cake) కట్ చేశారు. ఆ కేక్ ముక్కను 77 సంవత్సరాల తర్వాత తాజాగా వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది. ఈ కేక్ ముక్కకు ``వేరీ రేర్ స్లైస్`` (Rare cake slice) అని పేరు పెట్టారు. అయితే ఈ కేక్ ముక్క మాత్రం తినదగినది కాదు (Viral News).


క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ రాయల్ వెడ్డింగ్‌లో 9 అడుగుల ఎత్తు, 27 కిలోల బరువు ఉన్న కేక్‌ను కట్ చేశారు. అత్యంత రుచికరమైన ఈ కేక్‌ను పెళ్లికి హాజరైన రెండు వేల మంది విశిష్ట అతిథులు రుచి చూశారు. కొంత భాగం కేక్‌ను పలు స్వచ్ఛంధ సంస్థలకు పంపిణీ చేశారు. మరికొంత భాగాన్ని తమకు పుట్టబోయే బిడ్డ కోసం దాచి ఉంచారు. అలాగే మరో కేక్ పీస్‌ను మారియన్ పాల్సన్ అనే వ్యక్తికి బహుమతిగా ఇచ్చారు. ఈ పాల్సన్ అనే వ్యక్తి ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ హౌస్‌లో 1931 నుంచి 1969 హౌస్‌కీపర్‌గా పని చేశాడు. అతడికి కూడా కేక్ అందింది.


ఆ కేక్‌ను ప్రత్యేకంగా వెండితో తయారు చేసిన పెట్టెలో భద్రంగా ఉంచారు. అందువల్ల అది పాడైపోకుండా తాజాగా ఉంది. కాకపోతే ఆ కేక్ ముక్క తినడానికి మాత్రం పనికిరాదు. తాజగా ఆ కేక్ ముక్కను వేలం వేశారు. 77 సంవత్సరాల తర్వాత వేలం వేసిన ఈ కేక్ ముక్క ధర ఏకంగా రూ.2.4 లక్షలు పలికింది. ఇంతకు ముందు కూడా ఇలా రాయల్ వెడ్డింగ్ కేక్ పీస్‌లను వేలం వేశారు. చివరగా 2013లో వేలం వేసిన కేక్ పీస్ ధర రూ.1.91 లక్షలు పలికింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: కుక్కలతో ముంగిస భీకర ఫైట్.. పొలాల్లో జరిగిన ఈ సూపర్ యాక్షన్ సీన్ చూస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: పాపా.. అవి నీళ్లు కావు.. పెట్రోల్.. బంక్ దగ్గర ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..


Viral Video: వెరీ ఫన్నీ.. ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..


Viral Video: ఆశ్చర్యం.. భక్తురాలి జోలికి వెళ్లని పాము.. షాకింగ్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు ఏంటంటే..


Optical Illusion Test: మీ దృష్టి పర్‌ఫెక్ట్‌గా ఉంటుందా?.. అయితే ఈ ఫొటోలోని 3 బాతులు ఎక్కడ దాక్కున్నాయో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 10 , 2024 | 01:42 PM