Viral Video: ఛీ.. ఛీ.. పిచ్చి ముదిరితేనే ఇలా తింటారు.. ఉల్లిపాయను కాఫీలో ముంచి తింటే..
ABN, Publish Date - May 10 , 2024 | 04:04 PM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు రకరకాల ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఆహారం విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు రకరకాల ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఆహారం విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (Food Videos). వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో కొందరు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
foodmakescalhappy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి పచ్చి ఉల్లిపాయ ముక్కలను (Onions) బ్లాక్ కాఫీలో (Coffee) ముంచుకుని తిన్నాడు. ఆ తర్వాత కాఫీని తాగాడు. అనంతరం టేస్ట్ ఛండాలంగా ఉందంటూ మొహం అదోలా పెట్టాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వ్యక్తి.. ``నాకు ఉల్లిపాయలంటే ఇష్టం. కానీ కాఫీతో కాదు`` అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇప్పటివరకు 38 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఉల్లిపాయను గ్రైండ్ చేసి కాఫీలో కలుపుకుని తాగండి``, ``కాఫీతో మిరపకాయ మంచి కాంబినేషన్``, ``పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: టీచర్‌కు షాకిచ్చిన స్టూడెంట్.. ఈ కుర్రాడు అడిగిన ప్రశ్నకు మీరైనా సరైన సమాధానం చెప్పండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 10 , 2024 | 04:04 PM