Viral: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌.. ఈ జపాన్ వ్యక్తి టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:59 AM

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ``గాడ్ ఆఫ్ మ్యారేజ్``గా నిలిచిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్‌కు అనుగుణంగానే పయనం సాగిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం నలుగురు భార్యలు ఉన్నారు. వాళ్లు సరిపోరన్నట్టు మరో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను కూడా మెయింటెన్ చేస్తున్నాడు.

Viral: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌.. ఈ జపాన్ వ్యక్తి టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
This Japanese man lives with 4 wives and 2 girlfriends

సాధారణంగా చాలా మంది వ్యక్తులు తమ కెరీర్ గురించి, సంపాదన గురించి కలలు కంటారు. డాక్టర్ కావాలనుకుంటారు, ఇంజినీర్ కావాలనుకుంటారు. లేదా మంచి బిజినెస్ ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించాలనే టార్గెట్ పెట్టుకుంటారు. కానీ, జపాన్‌ (Japan)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కుటుంబం గురించి కలలు కంటున్నాడు. ``గాడ్ ఆఫ్ మ్యారేజ్`` (God of Marriage)గా నిలిచిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్‌కు అనుగుణంగానే పయనం సాగిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం నలుగురు భార్యలు (4 wives) ఉన్నారు. వాళ్లు సరిపోరన్నట్టు మరో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను కూడా మెయింటెన్ చేస్తున్నాడు (Viral News).


జపాన్‌కు చెందిన 36 ఏళ్ల ర్యూతా వతనాబే అనే వ్యక్తికి రూపాయి సంపాదన లేదు. ఎందుకంటే అతడి టార్గెట్ వేరు. వీలైనంత మందిని పెళ్లి చేసుకుని, ఎక్కువ మంది పిల్లలను కనాలనేది అతడి టార్గెట్. గత పదేళ్లుగా అతడు ఏ ఉద్యోగమూ చేయడం లేదు. ఇప్పటివరకు అతడు నలుగురు అమ్మాయిల్ని పెళ్లి చేస్తున్నాడు. మరో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అతడి నలుగురి భార్యల్లో ఒకరు డైవర్స్ తీసుకున్నారట. ప్రస్తుతం ముగ్గురు భార్యలతో కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పటికి పది మంది పిల్లలకు జన్మనిచ్చాడు. తాను మొత్తం 54 మంది పిల్లలకు తండ్రిని కావాలని వతనాబే కోరుకుంటున్నాడు.


వతనాబేకు సంపాదన గురించి దిగుల్లేదు. ఎందుకంటే అతడి ఖర్చులన్నింటినీ అతడి భార్యలే భరిస్తారు. అతడు ``హౌస్ హస్బెండ్`` పాత్రను పోషిస్తుంటాడు. భార్యలు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిపోతే ఇంటి పనులన్నీ చూసుకుంటాడు. ఇంట్లో వంట చేయడం, ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తుంటాడు. ఇంటి ఖర్చులను ముగ్గురు భార్యలు సమానంగా భరిస్తారట. వీరందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వతనాబేను ముగ్గురు మహిళలు ఉమ్మడి భాగస్వామిగా భావిస్తారు. వెరైటీ టార్గెట్ పెట్టుకున్న వతనాబే ఎంతో కృషితో దానిని చేరుకునేలాగానే కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..


Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..


Viral: రాజస్థాన్‌లో నిల్చుని మధ్యప్రదేశ్‌లో టిక్కెట్ తీసుకోవాలి.. ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుని అమితాబ్ కూడా షాక్..

Viral video: భయంకర ప్రమాదం.. ఎలక్ట్రిక్ వైర్ తెగి నీటిలో పడడంతో ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 08:59 AM