ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.. ఫోన్ చూసుకుంటూ ముందుకు వెళ్లిపోతే..

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:16 PM

ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయట తిరుగుతున్నప్పుడు కూడా మొబైల్ చూసుకుంటూనే పనులు చేస్తున్నారు. మొబైల్ మీద దృష్టి పెట్టి.. చుట్టు పక్కల పరిస్థితులను గమనించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

This man narrowly escapes from death

మొబైల్ (Mobile) ఫోన్ వినియోగం పెరిగాక చాలా మంది ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయట తిరుగుతున్నప్పుడు కూడా మొబైల్ చూసుకుంటూనే (Mobile Addiction) పనులు చేస్తున్నారు. మొబైల్ మీద దృష్టి పెట్టి.. చుట్టు పక్కల పరిస్థితులను గమనించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని వ్యక్తి త్రుటిలో మరణం (Death) నుంచి తప్పించుకున్నాడు. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం (Viral Video).


ఈ ఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో (Buenos Aires) జరిగింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి రైల్వే స్టాప్ దగ్గర మొబైల్ చూసుకుంటూ నిల్చున్నాడు. కొద్ది సేపటికి మొబైల్ చూస్తూనే ముందుకు ట్రాక్ (Railway Track) వైపు నుంచి నడవడం మొదలుపెట్టాడు. అయితే అదే సమయంలో ఓ రైలు (Train) ఆ పట్టాల మీద నుంచి వస్తోంది. చివరి నిమిషంలో గమనించిన ఆ వ్యక్తి రెప్ప పాటు కాలంలో వెనక్కి పరిగెత్తాడు. అయినప్పటికీ రైలు తగిలి కింద పడిపోయాడు. అయితే అతడికి గాయాలు కాలేదు. అంత పెద్ద ప్రమాదం నుంచి అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ ఘటన మొత్తం రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.


ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ``దేవుడే అతడిని కాపాడాడు``, ``ఈ ప్రపంచంలోని అదృష్టవంతులలో ఇతను ఒకడు``, ``సెకెన్ల వ్యవధిలో అతడి బ్రెయిన్ బాగా పని చేసింది``, ``మొబైల్ అడిక్షన్ ఇంత పని చేస్తుంది``, ``ఈ ఘటనను ఇతరులు కూడా గుణపాఠంలా తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral video: షాకింగ్.. రీల్ మోజులో ప్రాణం పోగొట్టుకున్నాడు.. తల, మొండెం వేరవడంతో మృతి.. ఆగ్రాలో దారుణం..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి మూడు పాములను ఎలా బయటకు వదులుతోందో చూడండి.. !

Viral Video: వావ్.. ఆ సింహం స్వాగ్‌కు ఫిదా కావాల్సిందే.. బానెట్ మీద నిల్చుని ఎలా ప్రయాణించిందో చూడండి..


Funny Answer Sheet: హిస్టరీ పరీక్షలో ఆ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్.. టీచర్ ఏం చేశారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 20 , 2024 | 01:16 PM