Viral: రూ.23 లక్షల శాలరీ వద్దంటూ.. రూ.18 లక్షల ప్యాకేజీవైపు మొగ్గు!
ABN, Publish Date - Oct 13 , 2024 | 09:30 AM
రూ.23 లక్షల శాలరీ ఇచ్చే జాబ్ కాదనుకుని ఓ వ్యక్తి రూ.18 లక్షల శాలరీ ఇచ్చే జాబ్‌లో చేరాడు. వ్యక్తిగత జీవితానికి సమయం లభించే రెండో జాబ్ మేలనుకున్న అతడు తక్కువ శాలరీకి కూడా అంగీకరించాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల తీరుతెన్నుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. లక్షల కొద్దీ శాలరీలు, ఉరుకులపరుగుల లైఫ్ కంటే జీవితాన్ని ఆశ్వాదించడమే మేలని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది. రూ.23 లక్షల వార్షిక శాలరీ ఇచ్చే ఉద్యోగాన్ని కాదనుకుని ఓ వ్యక్తి కేవలం రూ.18 లక్షల శాలరీ ఇచ్చే ఉద్యోగంలో చేరిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అతడి స్నేహితుడు స్వయంగా ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు (Viral).
Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..
తక్కువ శాలరీ ఇచ్చే ఉద్యోగాన్ని తన ఫ్రెండ్ ఎందుకు అంగీకరించిందీ చెబుతూ కటారియా అనే వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. అతడి నిర్ణయం తొలుత సబబు కాదని తనకు అనిపించిందని, కానీ లోతుగా ఆలోచిస్తే తన ఫ్రెండ్ సరైన నిర్ణయమే తీసుకున్నట్టు నమ్మకం కుదిరిందని కటారియా వ్యాఖ్యానించారు. కటారియా చెప్పిన వివరాల ప్రకారం, ఆయన స్నేహితుడికి తొలుత రూ.25 లక్షల ప్యాకేజీతో ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడ వారానికి ఆరు పనిదినాలు కాగా, వర్క్ ఫ్రం హోం సౌలభ్యం లేదు. రెండో కంపెనీలో రూ.18 లక్షలే ఇస్తామన్నారు కానీ వారానికి మూడు రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. రెండు ఆఫర్ల గురించి ఆలోచించిన అతడు చివరకు రూ.18 లక్షల వార్షిక శాలరీ ఉన్న జాబ్‌కే ఒకే చెప్పాడు.
Viral: నడిరోడ్డుపై పోలీసును నిలదీసిన బైకర్.. షాకింగ్ వీడియో!
హైబ్రీడ్ వర్క్ సంస్కృతి ఉన్న సంస్థలో జాబ్‌తో పాటు కుటుంబానికీ తగినంత సమయం కేటాయించేందుకు అవకాశం చిక్కుతుందని తన ఫ్రెండ్ భావించినట్టు కటారియా చెప్పుకొచ్చాడు. గతంలో తన ఫ్రెండ్ సుదీర్ఘపనిగంటలు ఉన్న ఉద్యోగాలు చేశాడని, దానివల్ల ఆరోగ్యంపై ప్రభావం పడినట్టు అతడు చెప్పినట్టు వివరించాడు. దీంతో, లైఫ్‌లో తనకేం కావాలనే దానిపై అతడి అభిప్రాయాలు మారిపోయాయని చెప్పాడు. శాలరీలు, ప్యాకేజీల వెనకాల పరుగులు తీయకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆశ్వాదించేందుకే అతడు నిర్ణయించుకున్నట్టు వివరించాడు. తరచి చూడగా తనకూ అతడి ఆలోచన సబబే అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘నేటి ఉరుకుల పరుగుల కార్పొరేట్ ప్రపంచంలో శాలరీకంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పృహ పెరుగుతోంది. ఉద్యోగానికి ఆవల ఉన్న మరో జీవితాన్ని ఆశ్వాదించేందుకు మనందరికీ హక్కు ఉంది’’ అంటూ కటారియా తన పోస్టును ముగించాడు. అనేక మంది కటారియా అభిప్రాయంతో ఏకీభవించారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
Viral: నడిరోడ్డుపై పోలీసును నిలదీసిన బైకర్.. షాకింగ్ వీడియో!
Updated Date - Oct 13 , 2024 | 09:47 AM