ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ట్రక్ డ్రైవరే కానీ, మహానుభావుడు.. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:43 AM

ప్రస్తుత డిజిటల్ యుగంలో ట్యాలెంట్ ఉంటే చాలు.. సోషల్ మీడియా అందలం ఎక్కిస్తుంది. పాపులారిటీ మాత్రమే కాదు.. భారీ సంపాదనను కూడా అందిస్తుంది. ట్రెండ్‌ను ఫాలో అయి అప్‌డేట్ అవుతున్న వారు సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు.

truck driver from Jharkhand earns 10 lakh rupees in a month

ప్రస్తుత డిజిటల్ యుగంలో ట్యాలెంట్ ఉంటే చాలు.. సోషల్ మీడియా (Social Media) అందలం ఎక్కిస్తుంది. పాపులారిటీ మాత్రమే కాదు.. భారీ సంపాదనను కూడా అందిస్తుంది. ట్రెండ్‌ను ఫాలో అయి అప్‌డేట్ అవుతున్న వారు సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. ఝార్ఖండ్‌ (Jharkhand)కు చెందిన ఓ డ్రైవర్ (truck driver ) కూడా ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అయి ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ట్రక్ డ్రైవర్‌గా నెలకు రూ.30 నుంచి 40 వేలు సంపాదించే ఆ వ్యక్తి ప్రస్తుతం రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆర్జిస్తున్నాడు (Viral News).


ఝార్ఖండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజేష్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల రెసిపీలతో వెరైటీ వంటకాలు సిద్ధం చేస్తుంటాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అతడు ``R రాజేష్ వ్లాగ్స్`` అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేశాడు. అతడు వెరైటీగా వంటలు చేయడంతో పాటు తన పనికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకునేవాడు (Cooking Videos). దీంతో అతడి సబ్‌స్క్రైబర్ల సంఖ్య 18.6 లక్షలకు చేరింది. ఆదాయం విపరీతంగా పెరిగింది. డ్రైవర్‌గా అతడు నెలకు రూ.30 నుంచి 40 వేలు సంపాదించేవాడు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన తర్వాత సంపాదన విపరీతంగా పెరిగింది.


యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాజేష్ ఆదాయం అతడి వీడియోలకు వచ్చే వ్యూస్‌ను బట్టి ఉంటుంది. సగటున అతడు నెలకు రూ.4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఒక నెలలో వ్యూస్ బాగా ఎక్కువ రావడంతో ఆ నెలలో ఏకంగా రూ.10 లక్షలు ఆర్జించాడు. ప్రస్తుతం తన స్వంత ఊరిలో ఓ ఇల్లు కట్టుకుంటున్నాడు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కళ్లు చెదిరే సంపాదన ఉన్నా తన డ్రైవింగ్ వృత్తిని మాత్రం రాజేష్ వదల్లేదు. ఈ నెల 18వ తేదీన రాజేష్ లోడ్ తీసుకుని గౌహతీ వెళ్లాడు. మార్గమధ్యంలో ఉన్న బీహార్‌లోని వరదల గురించి ఓ వీడియో రూపొందించాడు.


ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి.. ఈ ఫొటోలో చెర్రీల మధ్యనున్న టమాటాను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!


Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!


Optical Illusion: చాలా కొద్ది మందే ఈ పజిల్ సాల్వ్ చేయగలిగారు.. ఈ ఫొటోలో దాక్కున్న నత్తని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 09:43 AM

Advertising
Advertising
<