Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!
ABN, Publish Date - Dec 06 , 2024 | 12:36 PM
గుళ్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు తన వద్ద ఓ చిట్కా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది గుళ్లోకి వెళ్లినప్పుడు చెప్పులు పోగొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుల స్టాండ్స్ లేని చోట ఈ సమస్య మరీ ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో దర్శనం తరువాత బయటకొచ్చాక చెప్పులు, షూస్ కనిపించకపోతే బిక్కమొహం వేయాల్సి వస్తుంది. ఏం చేయలేక వెనుదిరిగి రావాల్సిందే. ఈ అగత్యం తప్పించుకునేందుకు ఓ కొత్త టెక్నిక్‌తో ముందుకొచ్చిన ఓ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అతడి క్రేజీ ఐడియాకు జనాలు జేజేలు పలుకుతున్నారు (Viral).
Viral: సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన మహిళ.. బాత్రూమ్‌లల్లో కూర్చుని జర్నీ!
@rana_ka_rayta అనే అకౌంట్లో అతడీ వీడియోను పోస్టు చేశాడు. గుళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో విడిచిన చెప్పులు పోకుండా ఉండేందుకు తానో నింజా టెక్నిక్ ఫాలో అవుతున్నట్టు చెప్పాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గుణలో దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడా తాను ఇదే ఫార్ములా అమలు చేసి తన చెప్పుల జతను కాపాడుకున్నట్టు వివరించాడు.
అతడు చెప్పిన దాని ప్రకారం, రద్దీ ప్రాంతాల్లో విడిచిన చెప్పులు పోకుండా ఉండేందుకు ఒక్కో చెప్పును ఒక్కో చోట విడవాలి. ఒక్క చెప్పును చోరీ చేయడం వృథా కాబట్టి దొంగలు తమ ప్రయత్నాన్ని విరమించుకుంటారట. బూట్లు ఎక్కువ ఉన్న చోట అతడు ఓ చెప్పును విడిచిపెట్టాడు. మరో చెప్పును దూరంగా మరో చోట విడిచాడు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి నెట్టింట పంచుకున్నాడు.
Elon Musk: భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
ఇక వీడియోపై నెట్టింట రకరకాల కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. కొందరు అతడి టెక్నిక్‌ను వేనోళ్ల పొగిడారు. ఈ చిట్కాతో చెప్పుల చోరీలు తగ్గిపోతాయని అన్నారు. తాము ఇకపై ఇదే ఫార్ములా ఫాలో అవుతామని అన్నారు.కొందరు మాత్రం అతడి చెప్పుల జోడీపై కామెంట్స్ చేశారు. బాగా పాడై ఉన్న ఆ చెప్పులను ఒక చోట వదిలినా కూడా ఎత్తుకెళ్లే వాళ్లు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చాడు. మరికొందరు అతడి తెలివిపై సెటైర్లు పేల్చారు. ఇతడికి అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగమిస్తే సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెడతాడని సరదా కామెంట్స్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు
Updated Date - Dec 06 , 2024 | 01:10 PM