ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అర్ధరాత్రి నిద్రలేచిన వ్యక్తి.. వీధిలోకి తొంగిచూడగా షాకింగ్ సీన్.. గుంపులుగా చొరబడిన చిరుతపులులు.. చివరకు..

ABN, Publish Date - Jan 25 , 2024 | 05:19 PM

రోజురోజుకూ అడవులు తరిగిపోతుండడంతో జంతువుల మనుగడకు ప్రమాదం వాటిళ్లుతోంది. ఈ క్రమంలో పులులు, సింహాలు, ఏనుగులు.. అటవీ ప్రాంత గ్రామాల్లోకి చొరబడడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో...

రోజురోజుకూ అడవులు తరిగిపోతుండడంతో జంతువుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. ఈ క్రమంలో పులులు, సింహాలు, ఏనుగులు.. అటవీ ప్రాంత గ్రామాల్లోకి చొరబడడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అప్పుడప్పుడూ ప్రాణనష్టం సంభవించిన సందర్భాలను కూడా చూశాం. తాజాగా, డెహ్రాడూన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి నిద్రలేచిన వ్యక్తి.. వీధిలోకి తొంగిచూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. గుంపులుగా చొరబడిన చిరుతపులులు.. చివరకు ఏం చేశాయో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) డెహ్రాడూన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి పైఅంతస్తులో నిద్రపోతున్న ఓ వ్యక్తి.. అర్ధరాత్రి సమయంలో నిద్రలేచాడు. బాల్కనీ నుంచి తొంగిచూడగా.. వీధిలో షాకింగ్ దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా మూడు చిరుత పులులు (Leopards entered the street) వీధిలోకి చొరబడ్డాయి. అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Kitchenhacks: దువ్వెన వాడే ముందు ఇలా చేశారంటే.. ఏం జరుగుతుందో తెలుసా..

వీధిలో చుట్టూ గమనించిన పులులు.. చివరకు ఓ ఇంటి ప్రహరీ పైకి ఎక్కాయి. అటు నుంచి అటే ఇంట్లోకి చొరబడ్డాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! అక్కడెవరైనా ఉంటే.. ఏంటి పరిస్థితి’’.. అంటూ కొందరు, ‘‘కుక్కల మీద దాడి చేసినట్టున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చిన్నప్పుడు తరగతి గదిలో ఇలా చేశారా.. అంటూ యువతి వింత ప్రశ్న.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Updated Date - Jan 25 , 2024 | 05:28 PM

Advertising
Advertising