Harsh Goenka: ఆరోగ్యకర జీవితం కోసం మూడు సింపుల్ టిప్స్.. డాక్టర్ వీడియోను షేర్ చేసిన హర్ష్ గోయెంకా!
ABN, Publish Date - Mar 29 , 2024 | 03:42 PM
మారుతున్న జీవనశైలి, విపరీతంగా పెరిగిపోతున్న ఒత్తిడి అనేక వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
మారుతున్న జీవనశైలి, విపరీతంగా పెరిగిపోతున్న ఒత్తిడి అనేక వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అవి ఒక్కసారి వచ్చాయంటే ఇక జీవితాంత భరించకతప్పదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకర జీవనం (Healthy Life) కోసం మూడు సింపుల్ టిప్స్‌ను సూచించిన ఓ డాక్టర్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) పంచుకున్నారు (3 tips to Healthy Life).
90 ఏళ్లు దాటిన తన పేషెంట్లు పలువురితో మాట్లాడిన డాక్టర్ చోక్సీ ఆ వీడియోలో తన అనుభవాలను పంచుకున్నారు. ``ఆరోగ్యకర జీవనం కోసం మూడు సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు. మొదటిది సంతోషంగా ఉండడం. రెండోది.. ఉన్న దాంతో సంతృప్తి చెందడం. మూడోది.. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం. 90 ఏళ్లు దాటిన నా పేషెంట్ ఒకరు ఇప్పటికీ రెగ్యులర్‌గా జిమ్‌కు వెళతారు. 90 ఏళ్ల వయసులో కూడా ఆమె బ్రెయిన్ చాలా షార్ప్. ఆమె స్వయంగా వంట చేసుకుంటుంద``ని చెప్పారు.
``చాలా సార్లు మన అరుగుదలకు మించి తినాలని ఆశపడతాం. మనకు దక్కిన దాంతో సంతృప్తి చెందలేం. అందువల్లే కోపం వస్తుంది. ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో రోగాలు మన మీద దాడి చేస్తాయ``ని డాక్టర్ చోక్సీ చెప్పారు. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన హర్ష్ గోయెంకా.. ``సుదీర్ఘ, ఆరోగ్యకర జీవితానికి సింపుల్ సీక్రెట్స్`` అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Shocking: అమ్మాయిలూ.. జాగ్రత్త! హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం సెలూన్‌కు వెళ్లితే కిడ్నీలు పాడయ్యాయి.. ఎందుకంటే..
Puzzle: మీ కళ్లకు సవాల్!.. ఈ అడవిలో గుర్రం ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..!
Updated Date - Mar 29 , 2024 | 03:42 PM