Shocking Video: ఆహారం కోసం వెతుకుతున్న పులి.. ఇంతలో ఎదురుగా వచ్చిన ఎలుగుబంటి.. తర్వాతేం జరిగిందో చూడండి..
ABN, Publish Date - May 01 , 2024 | 03:19 PM
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బృందంగా అటవీ పర్యటనలకు వెళుతూ క్రూర మృగాలను, వాటి వేటను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అడవిలో తమకు ఎదురైన అనుభవాలను చిత్రించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆయా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్లకు (Safari Tours) వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బృందంగా అటవీ పర్యటనలకు వెళుతూ క్రూర మృగాలను, వాటి వేటను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అడవిలో తమకు ఎదురైన అనుభవాలను చిత్రించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆయా వీడియోలు (Jungle Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను రిటైర్డ్ ఐయేఎస్ అధికారి రాజీవ్ కుమార్ గుప్తా షేర్ చేశారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు పర్యాటకులు జీపులో వెళ్తున్నప్పుడు వారికి మార్గ మధ్యంలో ఓ పులి (Tiger) కనిపించింది. అది తన ఆహారం కోసం వెతుక్కుంటోంది. ఆ సమయంలో ఓ ఎలుగు బంటి (Bear) పొదలలో నుంచి బయటకు వచ్చింది. ఆ ఎలుగును చూసిన పులి వెంటనే నక్కి కూర్చుండిపోయింది. ఆ ఎలుగు వెళ్లిపోయిన తర్వాత పైకి లేచింది. ఆ ఎలుగు వెళ్లిన మార్గం దగ్గరకు వెళ్లిన పులి దాని కోసం వెతికింది. అకస్మాత్తుగా బయటకు వచ్చిన ఎలుగుబంటి.. పులి మీద దాడికి దిగింది.
పులి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా, సహనంగా నిల్చుని ఉండిపోయింది. దీంతో ఎలుగు బంటి తన మార్గంలో తను వెళ్లిపోయింది. ఆ ఎలుగు వెళ్లిన మార్గం వైపు పులి అలా చూస్తూ ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో ఉన్న ఐదు పైన్ ఆపిల్స్‌ను కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 01 , 2024 | 03:19 PM