Viral News: అక్కడ బూతులు మాట్లాడితే ఫైన్ కట్టాల్సిందే.. ఆ గ్రామ పెద్దలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:32 PM
చాలా చోట్ల మగవాళ్లు ఇద్దరూ గొడవపడుతూ ఇంట్లో అడవాళ్లను ప్రస్తావిస్తూ తిట్లు మొదలుపెడతారు.వినడానికే అసహ్యంగా అనిపించే భాషలో తిడుతుంటారు. దీనిని ఆపేందుకు మహారాష్ట్రలోని ఓ గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు.
చాలా గ్రామాల్లో (Village) గొడవలు జరిగినపుడు చాలా మంది బూతులు తిట్టుకుంటారు. వినడానికే అసహ్యంగా అనిపించే భాషలో తిడుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో అడవాళ్లను ఉద్దేశించి అసభ్యంగా దూషిస్తారు. మగవాళ్లు ఇద్దరూ గొడవపడుతూ అడవాళ్లను ప్రస్తావిస్తూ తిట్లు మొదలుపెడతారు. దీనిని ఆపేందుకు మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా దూషించే పదజాలం (Abusive language) వాడడాన్ని నిరసిస్తూ తీర్మానం చేశారు. అహల్యానగర్ జిల్లా నెవాసా తహసీల్ గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభలో ఈ తీర్మానం చేశారు (Viral News).
నెవాసా తహసీల్ గ్రామం ముంబై మహా నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామ సర్పంచ్ శరద్ అర్గాడే మహిళలను దూషిస్తూ చేసే వ్యాఖ్యలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. వాదనల సమయంలో తల్లులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడటం సర్వసాధారణంగా మారిపోయిందని, దానిని ఆపేందుకు తమ గ్రామ ప్రజలందరూ కలిసి కట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నారని శరద్ తెలిపారు. ఇకపై గ్రామంలో ఎవరైనా అలా మాట్లాడితే గ్రామ పంచాయితీకి రూ.500 జరిమానాగా చెల్లించాలని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేలా తమ గ్రామ ప్రజలెవరూ ఇకపై మాట్లాడరని తెలిపారు.
మహిళలను తిట్టే విషయంలోనే కాదు, సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో మహిళలను అగౌరవపరచడాన్ని కూడా ఆ గ్రామ ప్రజలు నిరసిస్తున్నారు. ``మేము వితంతువులను సామాజిక, మతపరమైన ఆచారాల పేరుతో హింసించడ. భర్త చనిపోయిన మహిళల బొట్టు తీసెయ్యడం, మంగళసూత్రం తీయడం, గాజులు పగలగొట్టడం వంటివి నిషేధం`` అని పేర్కొన్నారు. 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 1800 మంది ప్రజలు ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన శని శింగనాపూర్ దేవాలయం నెవాసా తాలూకాలో ఉంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..
Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 29 , 2024 | 03:48 PM