Share News

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:03 PM

మీలో ఎవరైనా తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది మీకోసమే. తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిపెద్ద పండగ దసరా. విద్యార్థులకు అత్యధిక సెలవులు లభించేది ఇప్పుడే. తెలంగాణలో బతుకమ్మ, దసరాకు సెలవులు కలిపి వస్తాయి. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు 10-15 రోజులు సెలవులు ప్రకటించారు. సెలవులొచ్చాయంటే చుట్టాల రాకతో ఊళ్లకు కొత్త కళ వస్తుంది. మరి మీలో ఎవరైనా తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది మీకోసమే. తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్​(IRCTC)పర్యాటకుల కోసం తక్కువ ధరకే ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తోంది.


విహారయాత్రల నుంచి మతపరమైన ప్రదేశాల వరకు ఇందులో ఉన్నాయి. తాజాగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఓ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ‘దక్షిణ్ దర్శన్ యాత్ర(Dakshin darshan yatra)’ పేరుతో ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ మొత్తం 11 పగళ్లు, 10 రాత్రులు ఉంటుంది. తిరుమల, పద్మావతి ఆలయం, రామనాథస్వామి జ్యోతిర్లింగ ఆలయం, మధుర మీనాక్షి, కన్యాకుమారి, పద్మనాభస్వామి ఆలయాలతోపాటు అనేక ఆలయాలు ఈ టూర్ ప్యాకేజీలో ఉన్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. రైలు టిక్కెట్లు, బస్ సర్వీస్, హోటల్ బస, ఆహారం, దేవాలయాలను సందర్శించే టిక్కెట్లన్ని ఒకే ప్యాకేజీలోనే ఉంటాయి.


ప్యాకేజీల ధర..

దక్షిణ్ దర్శన్ యాత్ర ప్యాకేజీ రూ.19 వేల 930 నుంచి ప్రారంభమవుతుంది. ట్రైన్‌లో స్లీపర్, సెకండ్, థర్డ్ ఏసీలను ఎంచుకోవచ్చు. స్లీపర్‌లో ప్రయాణిస్తే ఒకరికి రూ.19 వేల 930, సెకండ్ ఏసీ కోసం ఒక్కొక్కరు రూ.43,865, థర్డ్ ఏసీ కోసం రూ.35 వేల 930 చెల్లించాలి.

బుకింగ్ ఇలా..

ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ప్రయాణికులు టూర్ ప్యాకేజీని ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకోవాలి. ప్యాకేజీకి సంబంధించిన సమాచారం కోసం వాళ్లతో ఫోన్లో సంప్రదించవచ్చు.

Tour Plans: లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు

For Latest News and National News click here

Updated Date - Sep 30 , 2024 | 12:03 PM