Viral Video: నీ తెలివికి సలాం బాసూ.. కారును ట్రాక్టర్‌లా ఎలా మార్చేశారో చూడండి.. నెటిజన్ల కామెంట్లు వింటే..
ABN, Publish Date - Dec 13 , 2024 | 07:39 PM
ఏదైనా కష్టమైన సమస్య ఎదురైనపుడు బ్రెయిన్ ఉపయోగించి దానిని సులభంగా పరిష్కరించడం మన దేశ వాసులకు ఇష్టం. కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అవసరం ఆవిష్కరణలకు తల్లి లాంటిది అంటారు. ఏదైనా కష్టమైన సమస్య ఎదురైనపుడు బ్రెయిన్ ఉపయోగించి దానిని సులభంగా పరిష్కరించడం మన దేశ వాసులకు ఇష్టం. కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలోని వ్యక్తి ట్రాక్టర్ (Tractor) ఇంజన్ అవసరం లేకుండానే ట్రాలీని లాక్కెళ్లిపోతున్నాడు. పాత వేగనార్ (Wagon R) కారును ఇంజిన్‌లా ఉపయోగించాడు (Viral Video).
jugadufamily అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వ్యాగన్ ఆర్ కారు వెనుక భాగాన్ని కట్ చేసి రెండు చక్రాల కారుగా మార్చాడు. ఆ వెనుక భాగానికి ట్రాక్టర్ ట్రాలీని అమర్చాడు. ఆ వేగన్ ఆర్ కారును ట్రాక్టర్ ఇంజిన్‌గా మార్చాడు. ఆ కారు ఆ ట్రాలీని సులభంగా లాక్కెళ్లిపోతోంది. పాత కారునే అతడు ట్రాక్టర్ ఇంజిన్‌లా ఉపయోగించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే లోడ్ చేసి ఉన్న ట్రక్కును లాగ గలిగే సామర్థ్యం ఆ కారుకు ఉండే అవకాశం లేదు. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ట్రాక్టర్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది``, ``ట్రాలీని లోడ్ చేసిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది``, ``బ్రేక్‌లు అప్లయ్ చేయడం ఎలా``, ``మంచి ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: సింహంతో ఆడుకోవాలనుకున్నాడు.. చుక్కలు చూశాడు.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video: రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడు.. ఆ పేద బాలుడి కళ్లలో సంతోషం కోసం..
IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో ఉన్న తప్పు ఏంటో 5 సెకెన్లలో పట్టుకోండి..
Viral Video: వామ్మో.. పచ్చి మిరప లిప్‌స్టిక్.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిప్ చూస్తే మండిపోవడం ఖాయం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 13 , 2024 | 07:39 PM