Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!
ABN, Publish Date - Jul 29 , 2024 | 11:27 AM
లారీ డ్రైవర్ ఉద్యోగం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే ట్రక్కు డ్రైవర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారు. పగలే కాకుండా రాత్రి కూడా ట్రక్ నడపాల్సి ఉంటుంది. ఆహారం, టీ, నీటి కోసం డ్రైవర్లు హైవే చుట్టూ ఉన్న దాబాలపై ఆధారపడతారు. చాలా వరకు సవ్యంగానే వ్యాపారం చేస్తారు.
లారీ డ్రైవర్ (Truck driver) ఉద్యోగం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే ట్రక్కు డ్రైవర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారు. పగలే కాకుండా రాత్రి కూడా ట్రక్ నడపాల్సి ఉంటుంది. ఆహారం, టీ, నీటి కోసం డ్రైవర్లు హైవే చుట్టూ ఉన్న దాబాలపై ఆధారపడతారు. చాలా వరకు సవ్యంగానే వ్యాపారం చేస్తారు. మరికొందరు మాత్రం దారుణంగా మోసం చేస్తుంటారు. తాజాగా ఓ ట్రక్ డ్రైవర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. అతడి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న వీడియోలో ఆ ట్రక్ డ్రైవర్, హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి కోసికి (Faridabad to Kosi) వెళ్లే రహదారిలో ఉన్న చిన్న చిన్న దుకాణాల వద్ద టీ (Tea) తాగవద్దని ప్రజలకు సలహా ఇస్తున్నాడు. తాను దారిలో ఓ చిన్న టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగనని, వారు తనను మత్తులో ముంచి తన ట్రక్కులోని 350 లీటర్ల డీజిల్ (Diesel)ను కొట్టేశారని తెలిపాడు. ఆయా షాపుల్లో టీలో నిద్రమాత్రలు వేసి ఇస్తారని, లారీ బయల్దేదరిన తర్వాత కొందరు ఫాలో అవుతారని, ఎక్కడైన లారీ ఆపి డ్రైవర్ నిద్రపోతే డీజిల్, ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తారని హెచ్చరిస్తున్నాడు. వాళ్లు కలిపిన నిద్ర మాత్రల వల్ల ఓ ప్రమాదం బారిన పడబోయానని, త్రుటిలో తప్పించుకున్నానని తెలిపాడు.
trukc_lover అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 45 లక్షలకు పైగా వీక్షించారు. 1.7 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేశారు. ``ప్రజలను అప్రమత్తం చేసినందుకు, హెచ్చరించినందుకు చాలా ధన్యవాదాలు``, ``గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాలు చాలా ప్రమాదకరమైనవి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Jul 29 , 2024 | 11:27 AM