Optical illusion: ఈ అడవిలో కనపడకుండా దాక్కున్న జంతువును.. 10 సెకన్లలో గుర్తించగలరా..?
ABN, Publish Date - Mar 12 , 2024 | 07:40 PM
ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాల్లో కొన్ని ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. పైకి కనిపించేది ఓ దృశ్యమైతే.. కనిపించడకుండా అంతర్లీనంగా మరో వస్తువు, మనిషి లేదా జంతువు దాక్కుని ఉంటుంది. అయితే ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరించలేం. ఇలాంటి...
ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాల్లో కొన్ని ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. పైకి కనిపించేది ఓ దృశ్యమైతే.. కనిపించడకుండా అంతర్లీనంగా మరో వస్తువు, మనిషి లేదా జంతువు దాక్కుని ఉంటుంది. అయితే ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరించలేం. ఇలాంటి ఆసక్తిని కలిగించే అనేక ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో ఓ జంతువు దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరు జీనియస్ అని అర్థం.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ ఉన్న ఫొటోలో మీకు ఓ అడవి కనిపిస్తోంది కదా.. పెద్ద పెద్ద వృక్షాలతో నిండిన ఈ అడవిలో ఓ జింక (deer hiding in the forest) కూడా ఉంది. దాన్ని గుర్తించడం అంత సులభం ఏమీ కాదు. కాస్త తీక్షణంగా చూస్తే సెకన్ల వ్యవధిలో చెప్పేయచ్చు. ఫొటోను చూడగానే చాలా మంది జింకను వెంటనే గుర్తుపడుతున్నారు. కొందరు మాత్రం ఎక్కడుందా అని చూస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. అలాంటి వారి కోసం క్లూ ఇవ్వాలంటే.. ఈ అడవిలో ఉన్న జింక ప్రాణంలో ఉన్న జింక కాదు. అక్కడున్న చెట్లన్నీ కలిసి జింక ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మీరు ఆ జింకను గుర్తించకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral Video: పురాతన సమాధిని తవ్వుతుండగా అడుగున షాకింగ్ సీన్.. ఎవరూ ఊహించని విధంగా..
Updated Date - Mar 12 , 2024 | 07:40 PM