ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tulsi Plant: తులసి మొక్క సరిగా పెరగట్లేదా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..!

ABN, Publish Date - Jun 01 , 2024 | 02:14 PM

సరిగ్గా గమనిస్తే కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తాయి. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. అలా కాకుండా తులసి మొక్కలు ఏపుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటిస్తే తులసి మొక్కను పదే పదే నాటాల్సిన అవసరం ఉండదు.

తులసి మొక్క భారతదేశంలో ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని దైవంగా పూజిస్తారు. తులసిలో ఎందరో దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే సరిగ్గా గమనిస్తే కొన్ని ఇళ్లలో తులసి మొక్కలు చాలా ఏపుగా చక్కగా పెరిగి ఎంతో అందంగా కనిపిస్తాయి. మరికొన్ని ఇళ్ళలో తులసి మొక్కలు సరిగా పెరగవు. అలా కాకుండా తులసి మొక్కలు ఏపుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ పాటిస్తే తులసి మొక్కను పదే పదే నాటాల్సిన అవసరం ఉండదు. చాలా రోజుల పాటూ పచ్చగా ఉంటుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

నేల..

తులసి మొక్కకు ఎక్కువ నీరు పోస్తే మూలాల్లో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మట్టిలో మాత్రమే మొక్కను పెంచడం సరికాదు. అటువంటి పరిస్థితిలో, మీరు బాగా ఎండిపోయిన మట్టిని తీసుకోవాలి. ఇందులో 50% తోట మట్టి, 20% ఇసుక, 10% వర్మీ కంపోస్ట్ మరియు 10 శాతం సేంద్రియ ఎరువులు ఉంటాయి. దీని వల్ల తులసి వేర్లలో ఎక్కువ కాలం నీరు నిలవదు. ఆపై మొక్క చాలా కాలం పాటు ఆకుపచ్చగా ఉంటుంది.

ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!


పోషకాలు..

పోషకాల కొరత కారణంగా మొక్క సరిగ్గా పెరగదు. కాబట్టి నేల pH స్థాయిని జాగ్రత్తగా చూసుకోవడం, నేలకి పోషకాలను జోడించడం చాలా ముఖ్యం. దీని కోసం ఎరువు, కొబ్బరి పీచు లేదా చెట్టు బెరడు ముక్కలు కలపవచ్చు. సహజ ఎరువుగా, ఆవు పేడ పిండిని ఎండబెట్టి పొడి రూపంలో తయారు చేయవచ్చు. దీన్ని తులసి మొక్క మట్టిలో కలపాలి.

మట్టి కుండీ..

తులసి మొక్కను నాటడానికి మీడియం లేదా పెద్ద సైజు కుండి తీసుకోవచ్చు. కుండి కొద్దిగా లోతుగా, వెడల్పుగా ఉండాలి. కుండీ దిగువన రెండు పెద్ద రంధ్రాలు చేయాలి. కుండీలో రంధ్రాలు చేయడం అవసరం. దీని వల్ల నీరు లోపల నిలవకుండా ఉంటుంది. అదే కుండలో ఒక కాగితాన్ని ఉంచవచ్చు, దానిలో కంపోస్ట్ మట్టిని వేయవచ్చు.

మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!


విత్తనాలు లేదా మొక్క..

తులసి మొక్క ఎదుగుదలకు మట్టిని సిద్ధం చేసిన తరువాత కుండీలో విత్తనాలను సరిగ్గా నాటడం చాలా ముఖ్యం. విత్తనాలను నాటడానికి ముందు మట్టిని పూర్తిగా వేయాలి. దీని తరువాత 4 నుండి 5 అంగుళాల లోతు వరకు మట్టిలో బాగా పాతిపెట్టాలి. ఇది కాకుండా చిన్న తులసి మొక్కలను వేర్లతో సహా సేకరించి వాటిని వాటిని నాటుకోవచ్చు. ఇలా నాటిన తరువాత నీరు పెట్టాలి.

నీటి సరఫరా..

తులసి మొక్కకు చాలా తక్కువ నీరు అవసరమవుతుంది. కాబట్టి మట్టికి ఎంత అవసరమో అదే మొత్తంలో నీటిని మొక్కకు అందివ్వాలి. నేల చాలా పొడిగా లేదా చాలా తడిగా లేకుండా చూసుకోవాలి. ఇది కాకుండా మొక్కకు వేసవిలో ప్రతిరోజూ, శీతాకాలంలో ప్రతి రోజు నీరు పోయడం ముఖ్యం. తులసి మొక్కపై షవర్ సహాయంతో తేలికపాటిగా నీరు పోయడం మంచిది.

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!

మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 01 , 2024 | 02:31 PM

Advertising
Advertising