ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Turkish Airlines: మార్గమధ్యంలో పైలట్ మరణం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ABN, Publish Date - Oct 10 , 2024 | 02:59 PM

టర్కీష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యంలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: టర్కీష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యంలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది. సియాటెల్ నుంచి ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు (Viral).

Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!


ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ప్రకారం, మంగళవారం రాత్రి ఫ్లైట్ 204 విమానం మంగళవారం రాత్రి సియాటెల్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో పైలట్ పెహ్లివాన్ (59) అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయన కోలుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలవడంతో తుది శ్వాస విడిచారు. దీంతో, వెంటనే కోపైలట్ రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో విమానాన్ని న్యూయార్క్‌‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. సియాటెల్ నుంచి బయలుదేరిన 8 గంటలకు ఈ ఘటన సంభవించింది.

Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!


కాగా పెహ్లివాన్ పైలట్ 2007 నుంచి టర్కీష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నిబంధనలను అనుసరించి మార్చి 8న జరిపిన పరీక్షల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. దీంతో, యథావిధిగా ఆయన పనుల్లో చేరిపోయాడు. ఇంతలోనే ఊహించని ఉపద్రవం సంభవించింది. కానీ, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు కూడా సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పైలట్ మరణంపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్ కుటుంబసభ్యులు, సహోద్యోగులకు సానుభూతి తెలియజేసింది.

ఇక విమానయాన నిబంధనల ప్రకారం, పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా.. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ మెడికల్ సర్టిఫికేట్‌ను రెన్యూవల్ చేయించుకోవాలి.

Read Latest and Viral News

Updated Date - Oct 10 , 2024 | 03:12 PM